NTV Telugu Site icon

Tillu Square OTT: ప్రముఖ ఓటీటీలో ‘టిల్లు స్క్వేర్’.. వచ్చేది అప్పుడేనా?

Tilluu

Tilluu

టాలీవుడ్ లో యంగ్ హీరోలు సరికొత్త కథలతో ప్రేక్షకులను అల్లరించేందుకు రెడీ అవుతున్నారు.. ఇటీవల వచ్చిన చాలా సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి.. గతంలో డిజే టిల్లు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది..

ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.. మొదటి పార్టులో రాధిక అనే అమ్మాయి వల్ల మోసపోయిన హీరోకు.. ఇప్పుడు మళ్లీ మరో లేడీ వల్ల ఇబ్బంది ఎదురు కావడం వల్ల ఎలా రియాక్ట్ అవుతాడు అనేది సినిమా కథ.. కాకపోతే గతంలో వచ్చిన సినిమాకంటే ఈ సినిమాలో ఘాటైన రొమాన్స్ కూడా ఉంటుందని ట్రైలర్స్ చూస్తే అర్థం అవుతుంది..

ఇక ఈ సినిమా ఓటీటీ అప్డేట్ వచ్చేసింది.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా రివీల్ అయ్యాయి. ఈ సినిమాను తీవ్ర పోటీ నడుమ నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో రివీల్ చేశారు.. ఈ సినిమాను ఆ సంస్థ దాదాపు 35 కోట్లు చెల్లించి కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అలాగే నెల తర్వాత ఓటీటీలోకి విడుదల కానుందని సమాచారం.. ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు.. థమన్ మ్యూజిక్ ను అందించారు..

Show comments