NTV Telugu Site icon

Neha Shetty : OG లో రాధికా స్పెషల్ సాంగ్.. యూత్ కి జాగారమే

Og

Og

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్నారు. అందులో ఒకటి ఏఎం రత్నం నిర్మిస్తున్న హరహర వీరమళ్లు. ఈ సినిమాకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు మరొక యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో OG అనే సినిమాల ఎప్పుడో స్టార్ట్ చేసాడు. దాదాపు 70% షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది ఈ చిత్రం. పవన్ కళ్యాణ్ కు సంబంధించి కేవలం పది లేదా పదిహేను రోజుల షూటింగ్ మాత్రమే షూట్ బ్యాలెన్స్ ఉందని సమాచారం.

Also Read :Ruhani Sharma : మదిని దోచేస్తున్న రుహానీ శర్మ లేటెస్ట్ ఫొటోస్

కాగా ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను ఇటీవల స్టార్ట్ చేసాడు సుజిత్. పవన్ కళ్యాణ్ లేని సీన్స్ ను తెస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి కీలక అప్డేట్ వెలువడింది. హై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ ఉందట. అయితే ఈ స్పెషల్ సాంగ్ కోసం డీజే టిల్లు లో మెరిసిన నేహా శెట్టిని తీసుకున్నారు.ఆ విషయాన్ని ఈ అమ్మడు తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ థాయిలాండ్ లో జరుగుతుంది. ఈ సెట్స్ లో నేహా శెట్టి తాజాగా అడుగుపెట్టింది. తన అందం అభినయంతో రాధికగా డీజే టిల్లు లో అలరించిన నేహా శెట్టి OGలో స్పెషల్ లో ఏ మేరకు అందాలు ఆరబోస్తుందో అని ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేసున్నారు.