NTV Telugu Site icon

Viran Muttamsetty : అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా ఓ సినిమా..

Untitled Design (22)

Untitled Design (22)

ప్రస్తుతం డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ చిత్రాలను ఇటీవల కాలంలో టాలీవుడ్ ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కంటే కాస్త భిన్నమైన కాన్సెప్ట్‌లే బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా కొత్త చిత్రం రాబోతోంది. ఇప్పటికే విరాన్ ముత్తంశెట్టి పలు సినిమాల్లో నటించి ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్‌గా పురుషోత్తముడు చిత్రంలో నెగటివ్ షేడ్ లో కనిపించి మెప్పించారు.

Also Read: ANR 100 : తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి పునాది వేసిన మార్గదర్శకుడు : నాగార్జున.

విరాన్ ముత్తం శెట్టి హీరోగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కథాశంతో  తెరకెక్కనున్న యూత్ ఫుల్ లవ్ స్టోరీతో పాటుగా క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్‌గా ఉండబోతోంది. శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ బ్యానర్ మీద లక్ష్మీ సునీల, డా. పార్థసారథి రెడ్డి, ఎ. శివ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చలపతి పువ్వల దర్శకత్వం వహిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా P శ్రీనివాస్, D శ్రీనివాస్ (వాసు) వ్యవహరిస్తున్నా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి వినాయక చవితి కానుకగా టైటిల్‌ను ప్రకటించారు. గిల్ట్ అనే టైటిల్‌తో ఈ చిత్రం రాబోతోంది. ఈ మేరకు రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. టైటిల్‌తోనే సినిమా మీద అందరి దృష్టి పడేలా మేకర్లు ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా కజిన్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు విరాన్. అందుకు సంబంధించి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసాడు విరాన్ .

Show comments