Site icon NTV Telugu

NBK50inTFI : బాలయ్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన విక్టరీ వెంకటేష్..

Untitled Design (15)

Untitled Design (15)

నందమూరి బాలకృష్ణ నటుడిగా సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ, అభిమానులు కలిసి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ నోవాలెట్‌ ఆడిటోరియమ్‌ వేదికగా జరుగుతున్న ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రసంగించిన సినీయర్ హీరో విక్టరీ వెంకటేష్, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, మంచు మోహన్ బాబు, నటి సుమలత ఏమన్నారో వారిమాటల్లో….

దగ్గుబాటి వెంకటేష్ : ఎన్టీఆర్ గారి కుటుంబం నుండి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు బాలయ్య బాబు. ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. 50 సంవత్సరాల నీ ప్రయాణం ఎంతో మంది కొత్త వారికి ఆదర్శం. ‘ఫ్లూట్ జింక ముందు కాదు, సింహం ముందు కాదు.’

శివ రాజ్ కుమార్: మేము ఒక కుటుంబం లాంటి వాళ్ళం. ఆయనకు తమ్ముడు లాంటి వాడిని. ఆయనతో కలిసి ఒక్క సినిమాలో నటించినందుకు నాకు ఎంతో సంతోషం. మేము చెన్నైలో ఉన్నప్పటి కలిసి ఉండేవాళ్ళం. మీరు ఇలాగే 100 సంవత్సరాలు వేడుకలు చేసుకోవాలి అని కోరుకుంటున్నాం.

మంచు మోహన్ బాబు : భారత దేశంలో నలుమూలల నుండి వచ్చిన అందరికీ నమస్కారం. చిన్నతనం నుండి నటుడిగా విభిన్నమైన, విశిష్టమైన నటుడు బాలయ్య. 500 రోజులకు పైగా ఒక సినిమా ఆడటం అనే ఘనత బాలయ్యదే. 3 సార్లు హిందూపూర్ ఎంఎల్ఏగా ఎన్నికవడం చాల ఆనందకరం. మీరు క్షేమంగా ఆరోగ్యంగా ఉండలని దేవుడిని ప్రార్థిస్తున్నాను

సుమలత: నేను బాలయ్య గారితో 2 సినిమాలలో నటించాను. బాలయ్య నాకు తెలిసినంత వరకు చాల సింపుల్ గా ఉంటారు, మనస్పూర్తిగా మాట్లాడతారు. ఆయన ప్రయాణం ఆదర్శనీయం. ఆయన సినీ, రాజకీయ రంగాలలో ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నాను.

Exit mobile version