NBK112 : బాలయ్య – కొరటాలశివ సినిమాకు అనిరుధ్ సంగీతం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ మరియు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం NBK112. అనౌన్సమెంట్ నుండే ఈ సినిమాపై అంచనాలు క్రేజీగా ఉన్నాయి. బాలయ్య ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ సీఎం పాత్రలో కనిపిస్తారనే వార్త ఇప్పటికే హల్చల్ చేస్తోండగా తాజాగా ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ పేరును చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నారట. ఈ వార్త బయటకు రావడంతో అటు నందమూరి అభిమానుల్లో ఇటు మ్యూజిక్ లవర్స్‌లో భారీ అంచనాలు మొదలయ్యాయి.
సాధారణంగా బాలకృష్ణ సినిమాలకు గత కొంతకాలంగా ఎస్.ఎస్. తమన్ ఆస్థాన సంగీత దర్శకుడిగా ఉంటూ వస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అన్ని మూవీస్ సాంగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్లను షేక్ చేశాయి. అయితే కొరటాల శివ ఈసారి కొత్తగా ట్రై చేయాలని భావిస్తున్నారట. ఇటీవల కొరటాల దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ చిత్రానికి అనిరుధ్ అందించిన సంగీతం గ్లోబల్ లెవల్లో హిట్ అయ్యింది. అదే మ్యాజిక్‌ను బాలయ్య సినిమా కోసం కూడా రిపీట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కొరటాల శివ గత సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్‌తో పని చేయగా దేవరతో అనిరుధ్‌తో సింక్ అయ్యారు. ఇప్పుడు బాలకృష్ణ సినిమా కోసం కూడా అనిరుధ్‌నే ఫైనల్ చేసే దిశగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే బాలయ్య మార్క్ పవర్ఫుల్ డైలాగ్స్‌కు అనిరుధ్ ఇచ్చే ఎలక్ట్రిఫైయింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సుధాకర్ చెరుకూరి (శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్) మరియు యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించి మే 7 నుంచి కీలక షెడ్యూల్స్ ప్రారంభం కానున్నాయి.
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!