NBK SDT : మెగా హీరో సెట్స్ లో నందమూరి బాలయ్య సందడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటసింహం నందమూరి బాలకృష్ణ మెగా హీరోకు అనుకోని సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం బాలయ్య హీరోగా నటిస్తున్న హ్యాట్రిక్ క్రేజీ ప్రాజెక్ట్ NBK111 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ లొకేషన్ పక్కనే మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న సరికొత్త చిత్రం ‘సంబరాల యేటి గట్టు‘ షూటింగ్ కూడా జరుగుతోందని బాలకృష్ణకు తెలిసింది. దాంతో బాలయ్య స్వయంగా తానే ఆ సెట్స్‌కు వెళ్లి సంబరాల యేటి గట్టు మూవీ టీమ్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు.
సెట్స్‌లోకి అడుగుపెట్టిన బాలయ్య బాబు.. సాయి దుర్గ తేజ్‌ను ఎంతో ఆప్యాయంగా పలకరించి ముచ్చటించారు. అనంతరం చిత్ర దర్శకుడు, నిర్మాతలతో కలిసి కాసేపు సమయం గడిపారు. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ అద్భుతంగా డిజైన్ చేసిన భారీ సెట్స్‌ను బాలకృష్ణ స్వయంగా పరిశీలించారు. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయని మేకర్స్ రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని ఆయన ప్రశంసించారు. షూటింగ్ స్పాట్లో చిత్ర యూనిట్ చూపిస్తున్న అంకితభావాన్ని, కష్టాన్ని చూసి బాలకృష్ణ ఎంతగానో అభినందించారు. గ్రామీణ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ టీమ్ మొత్తానికి తన ప్రత్యేక ఆశీస్సులు అందజేశారు. బాలయ్య రాకతో సెట్స్‌లో సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
తాజావార్తలు
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
-
Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
ట్రెండింగ్
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!