NBK 109: సంక్రాంతికే బాలయ్య కూడా దిగుతున్నాడు!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NBK 109 to Release on Sankranthi: ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో చిత్రాలను, పాత్రలను గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అందించారు. ముఖ్యంగా మాస్ ని మెప్పించే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లను అందించడంలో ఆయన దిట్ట. కొన్నేళ్లుగా అపజయమెరుగకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ, తన 109వ చిత్రం ‘NBK109’ కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లితో చేతులు కలిపారు. తెలుగు చిత్రసీమలో అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇప్పటివరకు, నిర్మాతలు ఈ చిత్ర టైటిల్‌ను వెల్లడించలేదు. దీంతో టైటిల్ తో పాటు, ఈ సినిమాకి సంబంధించిన ఇతర విషయాలు తెలుసుకోవాలని అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ దీపావళికి వారి నిరీక్షణకు తెరపడనుంది. దీపావళి శుభ సందర్భంగా, ‘NBK109’ టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నారు.
Ram Charna: అలియా భట్ కూతురి కోసం రామ్ చరణ్ షాకింగ్ నిర్ణయం
Also Read
- Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
- Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
- SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
- God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? 'గాడ్ ఆఫ్ వార్' సంగతేంటి!
ఈ సందర్భంగా నిర్మాతలు ఒక పోస్టర్ ను విడుదల చేశారు. దీనిలో గుర్రంపై స్వారీ చేస్తున్న నందమూరి బాలకృష్ణ లుక్ రాజసం ఉట్టిపడేలా ఉంది. ఈ చిత్రంలో గాడ్ ఆఫ్ మాసెస్ ని దర్శకుడు బాబీ, వయొలెంట్ పాత్రలో స్టైలిష్ గా చూపించబోతున్నారని స్పష్టమవుతోంది.ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి సంచలన స్వరకర్త ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
- Tags
- NBK 109
- Sankranthi
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!