NTV Telugu Site icon

NBK 109 : డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.. తమన్ తాండవం

Daakumaharaaj

Daakumaharaaj

సీనియర్ హీరోలలో సూపర్ హిట్స్ తో టాప్ లో దూసుకెళ్తున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం అయన తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ తో రానుంది ఈ సినిమా. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ప్రోమోను కాసేపటికి క్రితం రిలీజ్ చేసారు మేకర్స్. డేగా..డేగా గుర్రంపై స్వారీ చేసే సింహం ఇదేగా అంటూ సాగే ఈ సాంగ్ కు అనంత్ శ్రీరామ్  లిరిక్స్ అందించగా, నాకాష్ అజీజ్ పాడారు. 0. 51 సెకండ్స్ పాటు ఉన్న  ప్రోమో కు తమన్ అందించిన మ్యూజిక్ బీభత్సం అనే చెప్పాలి. అదేంటో గాని బలయ్య సినిమా అంటే చాలు తమన్ లో సంగీత దర్శకుడు పూనకం వచ్చి ఉగిపోతాడు ఏమో. ఆ రేంజ్ లో ఉంటుంది తమన్ మ్యూజిక్. తాజాగా రిలీజ్ అయిన ప్రోమో తమన్ తాండవం ఏంటో వినిపించేలా చేసింది. ఈ రోజు జస్ట్ ప్రోమోతో సరిపెట్టిన మేకర్స్ ఈ శనివారం ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకుని జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది డాకు మహారాజ్.