ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమాలు డైరెక్ట్ OTT లోనే విడుదలవుతున్నాయి. కోవిడ్ టైంలో అని చిత్రాలు ఓటీటీ దారి పట్టడంతో, ఓటీటీ మార్కెట్ రోజుకు పెరుగుతుంది. దీని ద్వారా అదనపు ఆదాయం వస్తుండటంతో, దర్శక నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్‌కు ముందే, డిజిటల్ రైట్స్‌ను డిల్ చేసుకుంటున్నారు. దీంతో వారికి కళ్లు చెదిరే లాభాలు వస్తున్నాయి. అందుకే బాడా హీరోలు హీరోయిన్‌లు వారి సినిమాలు డైరెక్ట్‌గా OTTలో విడుదల అంటే సరే అంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు లేడి సూపర్ స్టార్ నయనతార నటించిన లేటెస్ట్ సినిమా కూడా డైరెక్ట్ ఓటీటీ లో రిలీజ్ కాబోతుంది.
Also Read: Nani : ‘ది ప్యారడైజ్’ లో నాని రెండు జడల వెనుక రహస్యం ఇదే..!
నయన తార, సహా నటుడు సిద్ధార్థ్, మాధవన్ కలిసి నటించిన కొత్త చిత్రం ‘టెస్ట్’. పాన్ ఇండియా భాషల్లో ఈ ఏప్రిల్ 4 నుంచి దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో, డైరెక్ట్ స్ట్రీమింగ్ కి వస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఎస్ శశికాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శశికాంత్ తో పాటుగా చక్రవర్తి రామచంద్ర సంయుక్తంగా నిర్మాణం వహించారు. ‘టెస్ట్’ కథ గురించి మాట్లాడుకుంటే.. క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీ రూపొందిస్తున్నారు.చెన్నైలోని క్రికెట్ స్టేడియంలో టీం ఇండియా టెస్ట్ మ్యాచ్ మ్యాచ్‌ని చూడాటాకి ఈ వెలిన ముగ్గురు వెలతారు. అక్కడ వీరి జీవితాలు సమస్యల్లో పడ్డాడం? వాటిని ఎలా దాటారు? అనే విషయాలను డైరెక్టర్ ఈ మూవీలో చూపించాడు.