Site icon NTV Telugu

Naveen Polishetty : సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’

Sankranthi

Sankranthi

నవీన్ పోలిశెట్టి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. తనదైన ప్రత్యేక కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నవీన్‌ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సినిమా యూనిట్ చేసిన మోషన్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రంతో నవీన్‌ పొలిశెట్టి థియేటర్లలో నవ్వుల పండుగను తీసుకురాబోతున్నాడని మోషన్ పోస్టర్ తోనే అర్థమైంది.

Also Read:Sangita Bhil: హిందూ మతానికి ఆదర్శం ఈ “సంగీతా భిల్”, అత్తింటివారిని సనాతనంలోకి మార్చిన మగువ..

తెలుగు సినీ అభిమానులు సంక్రాంతి పండుగను సినిమా పండుగలా భావిస్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ లకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలోనే పండుగకి సరైన సినిమాగా ‘అనగనగా ఒక రాజు’ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో అడుగుపెట్టనుంది. తెలుగు సినీ పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి ‘అనగనగా ఒక రాజు’లో నవీన్‌ పొలిశెట్టికి జోడిగా నటిస్తున్నారు.

Also Read:Dil Raju: అసలు ఈ థియేటర్ల వివాదం అక్కడే మొదలైంది!

ఈ సినిమాతో మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రేక్షకులను సరికొత్త వినోదాన్ని అందించేలా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు మేకర్స్. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. పండుగ రుచికి సరిగ్గా సరిపోయేలా ఆయన తనదైన మ్యూజిక్ తో మరోసారి మ్యాజిక్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

Exit mobile version