Site icon NTV Telugu

Se*xual Harassment: బాల్యంలో పదే పదే లైంగిక వేధించారు.. షాకింగ్‌ విషయాలు బయటపెట్టిన ప్రముఖ నటి

Parvathy Thiruvothu

Parvathy Thiruvothu

Se*xual Harassment: సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న ఎంతో మంది.. కొన్ని సందర్భాల్లో వారి బాల్యం గురించి.. నిజజీవితంలో వారికి ఎదురైన చేదు అనుభవాల గురించి.. సంచలన విషయాలు బయటపెట్టిన సందర్భాలు లేకపోలేదు.. హాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ల నుంచి టాలీవుడ్‌ ఇలా అన్ని ఫిల్మ్‌ ఇండస్ట్రీలకు చెందినవారు కూడా తమకు ఎదురైన బ్యాడ్‌ డేస్‌.. ఎదుర్కొన్న సమస్యలు కొన్ని సార్లు బహిరంగంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి.. ఇప్పుడు.. జాతీయ అవార్డు గ్రహీత, దక్షిణాది ప్రముఖ నటి పార్వతి తిరువోతు.. తన బాల్య జీవితంలో ఎదుర్కొన్న తీవ్రంగా కలచివేసే అనుభవాలను బహిర్గతం చేశారు. గుర్తుతెలియని పురుషుల నుంచి తాను చిన్న వయసులోనే పదేపదే లైంగిక వేధింపులకు గురైనట్లు ఆమె వెల్లడించారు. ఈ విషయాలను ఆమె ఓ పాడ్‌కాస్ట్‌లో వివరించారు.

Read Also: Sankranti: కాశీ నుంచి కన్యాకుమారి దాకా.. ఇండియాలో సంక్రాంతి సంబరాలు ఎక్కడెక్కడ జరుగుతాయో తెలుసా?

అయితే, ముక్కుసూటి మాటతీరుతో, సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరచే వ్యక్తుల్తో నటి పార్వతి ఒకరు.. ఈసారి ఏ బిడ్డ కూడా భరించకూడని జ్ఞాపకాల గురించి మాట్లాడారు.. సంవత్సరాలుగా తన మనసులో ముద్రపడిపోయిన కొన్ని ఘటనలను గుర్తుచేసుకుంటూ, బాల్యంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను చెప్పుకొచ్చారు.

“మనం పుడతాం.. ఆ తర్వాత దోపిడీకి గురవుతాం”
పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన పార్వతి, వేధింపులు చాలా చిన్న వయసులోనే ప్రారంభమయ్యాయని చెప్పారు. “మనం పుడతాము, ఆ తర్వాత దోపిడీకి గురవుతాము. ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు, రద్దీ ప్రదేశాల్లో అనుకోకుండా జరిగే ఘటనలు.. ఇవి చిన్నపిల్లల మనసుపై తీవ్ర ప్రభావం చూపుతాయి,” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రత్యేక సంఘటనను ప్రస్తావిస్తూ, అది తనకు ఇప్పటికీ బాధను కలిగిస్తుందని తెలిపారు.

తల్లి నేర్పిన జాగ్రత్తలు
ఈ అనుభవాలు తన ఎదుగుదలపై ఎలా ప్రభావం చూపాయో కూడా పార్వతి వివరించారు. “నా తల్లి బయట ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి నాకు జాగ్రత్తలు నేర్పించేది. రోడ్డుపై ఎలా నడవాలి, ఎలా అప్రమత్తంగా ఉండాలి అనే విషయాలు చెప్పేది. ఒక తల్లి తన కూతురికి ఇవన్నీ నేర్పించాల్సిన పరిస్థితిని ఊహించండి,” అని అన్నారు. అప్పట్లో అర్థం కాని అనేక సంఘటనలు, కాలక్రమేణా మన శరీరం, మనసుపై ఎంత ప్రభావం చూపుతాయో ఇప్పుడు గ్రహిస్తున్నానని చెప్పారు.

నటనతో పాటు సామాజిక అంశాలపై గళం
పార్వతి తన నటనతోనే కాకుండా లింగ సమానత్వం, భద్రత, సమ్మతి వంటి అంశాలపై బహిరంగంగా మాట్లాడే నటి గా కూడా గుర్తింపు పొందారు. “బెంగళూరు డేస్”, “చార్లీ”, “ఉయిరే”, “మరియన్”, “ఖరీబ్ ఖరీబ్ సింగిల్” వంటి చిత్రాల్లో ఆమె నటన ప్రశంసలు అందుకుంది. ఇక, పార్వతి త్వరలో ‘ది స్టార్మ్’ అనే హై-స్టేక్స్ థ్రిల్లర్ సిరీస్‌లో కనిపించనున్నారు. ఇది హృతిక్ రోషన్ నిర్మాణ సంస్థ HRX ఫిలిమ్స్ నుంచి వచ్చే తొలి ప్రాజెక్ట్. అజిత్‌పాల్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో అలయ ఎఫ్, శ్రుష్టి శ్రీవాస్తవ, రామ శర్మ, సబా ఆజాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

Exit mobile version