NTV Telugu Site icon

ఇండస్ట్రీలో విషాదం… యాక్సిడెంట్ లో ప్రముఖ నటుడు మృతి

National Award Winner Sanchari Vijay passed away

సినీ ఇండస్ట్రీలో వరస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మొన్నటి వరకు కరోనా వైరస్ పగ బట్టి ఇండస్ట్రీలో చాలా మందిని పొట్టన పెట్టుకుంది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి అనుకుంటున్న తరుణంలో తాజాగా మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. జాతీయ అవార్డు గ్రహీత అయిన ఓ నటుడు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. కన్నడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంచారి విజయ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను హుటాహుటిన బెంగళూరులోని బన్నేర్ ఘట్టా రోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో చేర్చారు. జూన్‌ 12 రాత్రి విజయ్‌ తన స్నేహితుడిని కలిసిన అనంతరం బైక్‌పై ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో విజయ్‌ తల, కుడి కాలికి బలమైన గాయాలు తలిగాయి. నిన్న ఆయన పరిస్థితి విషమంగా ఉండగా ఇప్పుడు ఆయన కన్ను మూసినట్టు తెలుస్తోంది. విజయ్ బ్రెయిన్ దాదాపు డెడ్ అయినట్టేనని, చికిత్సకు స్పందించడం లేదని అంటున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన అవయవాలు దానం చేస్తున్నారని సమాచారం. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు.