Site icon NTV Telugu

Narvini Dery : ఆ హీరో చాలా దుర్మార్గుడు.. భయంకర నిజాలు బయటపెట్టిన నటి

Narvini Dery, Ajmal Ameer Controversy

Narvini Dery, Ajmal Ameer Controversy

తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న విషయం.. హీరో అజ్మల్ అమీర్ పై వచ్చిన అసభ్య ప్రవర్తన ఆరోపణలు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో అజ్మల్ అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడాడనే విషయం బయటకు రావడంతో హల్‌చల్ అయ్యింది. అయితే అజ్మల్ మాత్రం అది ఏఐ ఫేక్ వీడియో అని చెబుతూ, “నా కెరీర్‌ను ఇలాంటి తప్పుడు ప్రచారాలతో ఎవరూ దెబ్బతీయలేరు” అంటూ క్లారిటీ ఇచ్చాడు. కానీ తాజాగా తమిళ హీరోయిన్ నర్విని దేరి ఈ వ్యవహారంపై మీడియా ముందుకు వచ్చి, “అజ్మల్‌ అసలు అలాంటి వ్యక్తే!” అంటూ షాకింగ్ వివరాలు బయటపెట్టింది. ఆమె తెలిపిన వివరాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి..

Also Read : Mass Jathara : ‘మాస్ జాతర’లో సర్ప్రైజ్..రవితేజ ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ !

“2018లో చెన్నైలోని ఓ మాల్‌లో మొదటిసారి అజ్మల్‌ను కలిశాను, అప్పుడు ఆయన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ కోసం చూస్తున్నానన్నాడు. మాట్లాడుకుంటూ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. మరుసటి రోజు ఆడిషన్ కోసం రావాలని చెప్పాడు. నేను డెన్మార్క్‌కి వెళ్లాల్సి ఉందని చెప్పినా ఒప్పించి రమ్మన్నాడు. అక్కడికి వెళ్ళగానే ఏదో అసహజంగా అనిపించింది. రూమ్‌లోకి వెళ్లగానే ఆయన ఒక్కడే ఉన్నాడు. ‘ఇతరులు ఎక్కడ?’ అని అడిగితే అందరూ బయటకు వెళ్లారని అన్నాడు. ఆడిషన్ పేరుతో ఏదో తప్పు జరగబోతోందని అర్థమైంది. ఇంతలోనే నా చేయి పట్టుకొని డ్యాన్స్ చేద్దామన్నారు. నేను స్పష్టంగా తిరస్కరించాను. ‘మీ ఉద్దేశం నాకు అర్థమైంది, దానికోసమైతే నేను రాలేదు’ అన్నాను. కానీ, ఆయన ‘నా వెనక ఎంతో మంది అమ్మాయిలు పడతారు’ అంటూ గొప్పలుపోయాడు, చివరకు ఓ ఫోన్ కాల్ రావడంతో రూమ్ నుంచి తప్పించుకున్నా‌ను. నాకు జరిగినట్లే మరో అమ్మాయికి జరగకూడదు అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే .. అప్పుడు నేను నా చదువుపై, కెరీర్‌పై దృష్టి పెట్టాను. అందుకే కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఆయన నిజ స్వరూపం అందరికీ తెలిసి రావాలి” అని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజంట్ ఈ మ్యాటర్ మరోసారి వైరల్ అవుతుంది.

Exit mobile version