NTV Telugu Site icon

Narne Nithin: ‘ఆయ్’ అందుకే అనూకున్నాం.. ట్రైలర్ ఎన్టీఆర్‌కి బాగా న‌చ్చింది : నార్నే నితిన్‌ ఇంటర్వ్యూ

Narne Nithin Interview

Narne Nithin Interview

Narne Nithin Interview for Aay Movie: జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నుంచి రాబోతున లేటెస్ట్ మూవీ ‘ఆయ్’. మ్యాడ్ సినిమాతో మెప్పించిన ఎన్టీఆర్ బావమరిది- యంగ్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ ఆయ్ సినిమా ఆగస్ట్ 15న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హీరో నార్నే నితిన్ మీడియాతో ‘ఆయ్’ సినిమా విశేషాల‌ను పంచుకున్నారు.

అసలు ‘ఆయ్’ ఏంటండీ?
* సినిమాకు ముందుగా ‘ఆయ్’ అనే టైటిల్‌ను అనుకోలేదు. అర‌వింద్‌గారి ఆలోచనతోన ఈ టైటిల్ పెట్టాం. అందుకు కార‌ణం.. గోదావ‌రి స్లాంగ్‌లో ఆయ్ అనే ప‌దాన్ని కామ‌న్‌గా వాడుతుంటాం. అలాగే సినిమాలోని ప‌లు సంద‌ర్భాల్లో ఈ ప‌దాన్ని వాడ‌టాన్ని చూడొచ్చు. కాబ‌ట్టే టైటిల్‌ను ‘ఆయ్’ అని ఫిక్స్ చేశాం.

‘ఆయ్’ ఏంటి? ఫ‌న్ బాత్ ఏంటి?
* సినిమాలో ఫుల్ ఫన్ ఉంటుంది. కాబ‌ట్టి పోస్ట‌ర్స్‌లో అంతా ఫ‌న్ బాత్ అనే పెట్టాం. ఇది డైరెక్ట‌ర్‌గారి ఆలోచ‌న‌. సినిమా విడుద‌లైన రోజున ఆ విష‌యం స్ప‌ష్టంగా అంద‌రికీ అర్థ‌మ‌వుతుంది.

ఆగ‌స్ట్ 15న చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా?
* ఆగ‌స్ట్ 15న చాలా సినిమాలు రిలీజ్‌లున్నాయి. అయితే మాకుండాల్సిన ఆడియెన్స్ మాకున్నార‌ని అనుకుంటున్నాం. మంచి ఫ‌న్ ఉన్న గోదావ‌రి బ్యాక్ డ్రాప్ మూవీ వ‌చ్చి చాలా కాల‌మైంది. క‌చ్చితంగా ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తార‌ని న‌మ్ముతున్నాం.

ఈ పాత్ర కోసం ఎలాంటి హోమ్ వర్క్ చేశారు?
* చిన్న‌ప్ప‌టి నుంచి నాకున్న గోదావ‌రి ఫ్రెండ్స్‌తో మాట్లాడ‌టం, వాళ్లు మాట్లాడేట‌ప్పుడు విన‌టం చేశాను. కాబ‌ట్టి ‘ఆయ్’ మూవీలో స్లాంగ్ మాట్లాడేట‌ప్ప‌డు నాకేమీ ఇబ్బందిగా అనిపించ‌లేదు.

దర్శకుడితో ఎలా వైబ్ సెట్ అయింది?
* దర్శకుడు అంజి కె మణిపుత్ర అమలాపురం కుర్రాడు. ఆయ‌నకున్న ఫ్ర‌స్టేష‌న్స్‌, లైఫ్‌లో ఆయ‌న చూసినవ‌న్నీ క‌లిపి చేసిన సినిమానే ‘ఆయ్’. డైరెక్ట‌ర్ ఎవ‌రితోనైనా ఇట్టే క‌లిసి పోయే వ్య‌క్తి. సెట్స్‌లో అంద‌రితో ఫ్రెండ్లీగా ఉంటారు.

మ్యాడ్ -ఆయ్ రెండూ భిన్నమైన పాత్రలు కదా, ఎలా అనిపిస్తుంది?
* మ్యాడ్ మూవీ క‌థ‌కు త‌గ్గ‌ట్టు బిహేవ్ చేశాను. ‘ఆయ్’ సినిమా క‌థ‌కు త‌గ్గ‌ట్టు యాక్ట్ చేశాను. ఈ మూవీ కోసం స్పెష‌ల్ గా క‌ష్ట‌ప‌డ‌లేదు. డైరెక్ట‌ర్‌గారు చెప్పిన‌ట్లు ఫాలో అయ్యానంతే.

ట్రైల‌ర్ చూసి ఎన్టీఆర్‌ రియాక్షన్ ఏంటి?
* ఎన్టీఆర్‌గారు ట్రైల‌ర్ చూశారు. ఆయ‌న‌కు కామెడీ బాగా న‌చ్చింది. ఎంజాయ్ చేశారు. సినిమా చూసిన త‌ర్వాత కూడా ఆయ‌న ద‌గ్గ‌ర నుంచి అలాంటి రెస్పాన్స్ వ‌స్తే బావుంటుంద‌నిపిస్తుంది.

అంకిత్ కొయ్య‌, క‌సిరెడ్డితో వర్క్ ఎక్స్ పీరియన్స్?
* అంకిత్ కొయ్య‌, క‌సిరెడ్డిగారితో ‘ఆయ్’ సినిమాకు సంబంధించిన జ‌ర్నీ చాలా బావుంది. బాగా డిస్క‌ష‌న్ చేసుకుని ఎలా చేస్తే బావుంటుంద‌నే స‌ల‌హాల‌ను తీసుకుని న‌టించాం.

ఎందుకు కొత్త డైరెక్టర్లతోనే సినిమాలు?
* డెబ్యూ డైరెక్టర్స్‌తోనే సినిమాలు తీయాల‌ని ఏం అనుకోవ‌టం లేదు. క‌థ న‌చ్చితేనే సినిమాలు చేస్తున్నాను. మ్యాడ్ అయిన ‘ఆయ్’ మూవీ అయినా క‌థ న‌చ్చే న‌టించాను.

మ్యూజిక్ గురించి చెప్పండి..
మ్యూజిక్ గురించి చెప్పాలంటే రామ్ మిర్యాలగారు మూడు పాట‌లకు సంగీతాన్నిస్తే.. అజ‌య్ అర‌సాడ‌గారు రెండు పాట‌ల‌కు మ్యూజిక్ ఇస్తూ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. మ్యూజిక్ సినిమా స‌క్సెస్‌లో చాలా కీల‌క పాత్ర పోషిస్తుంది.

పక్కా గోదావరి సినిమాకి మరాఠీ అమ్మాయి ఎందుకు?
* హీరోయిన్ న‌య‌న్ సారిక మ‌రాఠీ అమ్మాయి. కానీ తెలుగు అమ్మాయిలా ఉంటుంది. త‌న పాత్ర అంద‌రికీ బాగా క‌నెక్ట్ అవుతుంది.

క్యాస్ట్ ఇష్యూ ఏదో టచ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది?
* కులం, మ‌తం కంటే స్నేహం చాలా గొప్ప‌ది. అంత కంటే గొప్ప విష‌య‌మేదీ ఉండ‌ద‌నే మెసేజ్‌ను ‘ఆయ్’ సినిమాలో ఇస్తున్నాం.

మీ కొత్త ప్రాజెక్టులు గురించి ఏమైనా చెప్పండి..
* మ్యాడ్ సీక్వెల్ షూటింగ్ జ‌రుగుతోంది. ఈ ఏడాదిలోనే రిలీజ్ ఉండొచ్చు. ఇంకా కొత్త ప్రాజెక్టులేవీ ఓకే చేయ‌లేదు.