తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన నటుడు నరేష్. ‘ప్రేమ సంకెళ్ళు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన, ‘నాలుగు స్తంభాలాట’ వంటి విజయాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన సినిమాల్లో ఎక్కువగా నటించిన నరేష్, తన హాస్య టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఆయన నటన కేవలం కామెడీ రోల్స్‌కే పరిమితం కాలేదు. సెంటిమెంట్, ఎమోషనల్, యాక్షన్ సినిమాల్లో కూడా రాణించి ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ధూసుకుపొతున్నారు. ఇక తాజాగా నారా రోహిత్, శ్రీదేవి సాహా జంటగా నటించిన సుందరకాండ సినిమాలో నరేష్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు.
Also Read : Dear Students : ‘డియర్ స్టూడెంట్స్’తో మళ్లీ ట్రాక్‌లోకి నివిన్ పౌలీ..!
ఆగస్టు 27న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నరేష్ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. “నాకు కామెడీ నటుడిగా మంచి పేరు ఉంది. రంగస్థలం తర్వాత ఎమోషనల్ క్యారెక్టర్స్ కూడా నాకిష్టమని, నేను బాగా చేయగలనని అందరూ గుర్తించారు. నా పాత్రలో కొత్తదనం ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. ప్రస్తుతం కొన్ని మంచి ఎమోషనల్ పాత్రలు చేస్తున్నాను. అలాగే నాలుగు రసాల్ని పండించే ఒక విచిత్రమైన పాత్ర కూడా చేస్తున్నాను. ఇవన్నింటికి మించి, ఒక పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా నటించబోతున్నాను” అని చెప్పారు. కానీ ఆ ప్రాజెక్ట్‌లో హీరో ఎవరు? దర్శకుడు ఎవరు? అనే విషయాలను మాత్రం గోప్యంగా ఉంచారు. “ఇప్పుడే చెప్పలేను కానీ ఆ సినిమా చాలా పెద్ద రేంజ్‌లో రూపొందుతుంది. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా తెలుస్తాయి” అని నరేష్ చెప్పారు. ప్రస్తుతం ఈ సమాచారం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. నరేష్ లాంటి వెటరన్ నటుడు పాన్ ఇండియా మూవీలో విలన్‌గా కనిపించబోతున్నాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
