NTV Telugu Site icon

‘పంచతంత్రం’లో నరేష్ అగస్త్య ఫస్ట్ లుక్ విడుదల

Naresh Agastya First Look from Panchathantram

బ్రహ్మానందం, సముతిర కని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘పంచతంత్రం’. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. సోమవారం నరేష్ అగస్త్య పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో అతని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సృజన్‌ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ “నరేష్ అగస్త్యకు మా ‘పంచతంత్రం’ చిత్రబృందం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. చిత్రంలో విహారి పాత్రలో అతను కనిపిస్తాడు. హైదరాబాద్ సిటీలో పుట్టి పెరిగిన అబ్బాయి పాత్రలో నరేష్ అగస్త్య అద్భుతంగా నటిస్తున్నాడు. ‘మత్తు వదలరా’ సినిమాతో ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖులు చూపును తనవైపు తిప్పుకొన్న అతను, విహారి పాత్రలో నటనతో మరోసారి మెస్మరైజ్ చేస్తాడు” అని అన్నారు. ఈ చిత్రంతో రచయితగా, దర్శకుడిగా పరిచయమవుతున్న హర్ష పులిపాక మాట్లాడుతూ “విహారి… ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. కార్పొరేట్ కంపెనీలో పని ఒత్తిడి కారణంగా వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన జీవితం మధ్య సమతుల్యం పాటించలేక కష్టాలు పడుతుంటాడు. ఈతరం యువతను ప్రతిబింబించేలా విహరికి ఎదురయ్యే సమస్యలు, సందర్భాలు ఉంటాయి” అని చెప్పారు.