‘పంచతంత్రం’లో నరేష్ అగస్త్య ఫస్ట్ లుక్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రహ్మానందం, సముతిర కని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘పంచతంత్రం’. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. సోమవారం నరేష్ అగస్త్య పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో అతని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సృజన్ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ “నరేష్ అగస్త్యకు మా ‘పంచతంత్రం’ చిత్రబృందం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. చిత్రంలో విహారి పాత్రలో అతను కనిపిస్తాడు. హైదరాబాద్ సిటీలో పుట్టి పెరిగిన అబ్బాయి పాత్రలో నరేష్ అగస్త్య అద్భుతంగా నటిస్తున్నాడు. ‘మత్తు వదలరా’ సినిమాతో ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖులు చూపును తనవైపు తిప్పుకొన్న అతను, విహారి పాత్రలో నటనతో మరోసారి మెస్మరైజ్ చేస్తాడు” అని అన్నారు. ఈ చిత్రంతో రచయితగా, దర్శకుడిగా పరిచయమవుతున్న హర్ష పులిపాక మాట్లాడుతూ “విహారి… ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. కార్పొరేట్ కంపెనీలో పని ఒత్తిడి కారణంగా వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన జీవితం మధ్య సమతుల్యం పాటించలేక కష్టాలు పడుతుంటాడు. ఈతరం యువతను ప్రతిబింబించేలా విహరికి ఎదురయ్యే సమస్యలు, సందర్భాలు ఉంటాయి” అని చెప్పారు.
Also Read
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Ram Gopal Varma: "ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది".. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
- Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
- Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
తాజావార్తలు
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
-
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?