Site icon NTV Telugu

చీటింగ్ కేసుపై స్పందించిన యాంకర్ శ్యామల భర్త…!

Narasimha Reddy reacts to his arrest

ప్రముఖ యాంకర్ శ్యామల భర్త, బుల్లితెర నటుడు నరసింహారెడ్డి మంగళవారం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఖాజాగూడకు చెందిన సింధూర రెడ్డి అనే మహిళ నరసింహారెడ్డి తన దగ్గర కోటి రూపాయలు అప్పుగా తీసుకున్నాడని, తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా బెయిల్ పై బయటకు వచ్చిన నరసింహ రెడ్డి ఈ విషయంపై స్పందించిన వీడియోను శ్యామల తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో నరసింహ రెడ్డి మాట్లాడుతూ “గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో నాపై వస్తున్న కథలు, కథనాల గురించి విషయం షేర్ చేసుకోవడానికి అన్నీ ఆధారాలతో, వివరాలతో మరో రెండ్రోజుల్లో మీ ముందుకు వస్తాను. నాకు న్యాయం, న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉంది. నేను రెండోజుల్లోనే బయటకు వచ్చానంటే అది తప్పుడు కేసు అని తెలుస్తోంది. కొన్నిసార్లు ఇలాంటి నిందలు భరించాల్సి వస్తుంది. వాటిని నిరూపించుకోవాల్సింది కూడా మన మీదే ఉంటుంది. ఇలాంటి సమయంలో నాకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు” అని ముగించాడు. ప్రస్తుతం నరసింహారెడ్డి అరెస్ట్ విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version