నారా రోహిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామమూర్తి నాయుడు కుమారుడైన రోహిత్ సినిమాల మీద ఆసక్తితో ఎప్పుడో బాణం అనే సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. ఆ తర్వాత చేసిన సోలో ఇలాంటి సినిమా ఆయనకు మంచి హిట్ వచ్చింది. ఆ తర్వాత చేస్తున్న సినిమాలన్నీ వైవిధ్యంగా ఉన్నా ఎందుకో హిట్స్ అందుకోలేకపోయాడు.
Also Read:Kamal Hasan : త్వరలోనే పహల్గాంకు వెళ్తా.. కమల్ హాసన్ కీలక ప్రకటన..
అయితే ఆయన తాజాగా భైరవం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో ఆయన మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. మే 30వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నారా రోహిత్ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా అనేక విషయాలు పంచుకున్న ఆయన తాను పుష్ప లాంటి సినిమాను మిస్ చేసుకున్నట్లు వెల్లడించాడు.
Also Read: TDP Mahanadu 2025: మరలా పెద్ద నోట్లు రద్దు చేయాలి.. మహానాడులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
తనను పుష్ప సినిమాలోని ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ కోసం ముందు అడిగారని, అయితే మాటలు జరుగుతున్న సమయంలోనే ఆ సినిమాను పాన్ ఇండియా సినిమాగా చేయాలని భావించి ఆ సమయంలో ఫహద్ ఫాజిల్‌ను సంప్రదించారని చెప్పుకొచ్చాడు. ఇక భైరవం సినిమా బాగా కుదిరిందని, తమిళంలో శశి కుమార్ చేసిన పాత్ర తాను ఇక్కడ పోషించానని చెప్పుకొచ్చాడు. కచ్చితంగా భైరవం హిట్ అవుతుందని నమ్మకం ఆయన వ్యక్తం చేశాడు. అలాగే తాను సుందరకాండ అనే సినిమాతో మరో నెల రోజుల్లో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించాడు.
