బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటిస్తున్న ఎంతగానో ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’ టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో పాజిటివ్ బజ్‌ను సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీగా నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పణలో, ఈ చిత్రం మే 30న సమ్మర్ సీజన్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నారా రోహిత్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
ఈ కథ మీ వద్దకు ఎలా వచ్చింది?
నిర్మాత బెల్లంకొండ సురేష్ గారు ఫోన్‌లో కథ గురించి చెప్పారు. ఆయన జడ్జిమెంట్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. శశి కుమార్ క్యారెక్టర్ గురించి వివరించారు. సినిమా చూశాను, చాలా నచ్చింది. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. తమిళ్‌లో రస్టిక్ విలేజ్ డ్రామాగా తీసిన ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశాం. ‘గరుడన్’ చూసినవారికి కూడా
ఇది ఒరిజినల్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది.
మీ ముగ్గురి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. దీని కోసం ఏదైనా ప్రత్యేకంగా చేశారా?
మాకు ఎప్పటినుంచో పరిచయం ఉంది, పర్సనల్‌గా కూడా చాలా దగ్గరగా ఉంటాం. దీంతో సెట్‌లో కంఫర్ట్ లెవెల్ బాగుంది. డైరెక్టర్ విజయ్‌కి స్పష్టమైన విజన్ ఉంది. ప్రతి క్యారెక్టర్ నుంచి ఎలాంటి పెర్ఫార్మెన్స్ కావాలో ఆయనకు తెలుసు. మాకు స్వేచ్ఛ ఇచ్చారు. ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత, ఎమోషనల్ డెప్త్ ఉంటాయి.
ఇకపై బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయబోతున్నారా?
చిన్న బ్రేక్ తీసుకోవాలనుకున్నా, అది కాస్త పెద్ద బ్రేక్ అయింది (నవ్వుతూ). ఇకపై రెగ్యులర్‌గా సినిమాలు వస్తాయి. ‘సుందరకాండ’ దాదాపు పూర్తయింది, జూలైలో రిలీజ్ కావొచ్చు. ఆగస్టులో మరో సినిమా స్టార్ట్ చేస్తున్నా.
మనోజ్, సాయి శ్రీనివాస్‌తో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
మనోజ్‌ను చిన్నప్పటి నుంచి తెలుసు, ఈ సినిమాతో మరింత దగ్గరయ్యాం. సాయిని 2010 నుంచి తెలుసు, అప్పట్లో డాన్స్ ప్రాక్టీస్ చేసేవాడు. సురేష్ గారితో ఓ సినిమా చేయాలనుకున్నాం, కానీ అది కుదరలేదు. ఈ సినిమాతో మాంచి బంధం ఏర్పడింది.
జయసుధ గారి పాత్ర గురించి?
జయసుధ గారు ఈ సినిమాలో బామ్మ పాత్రలో నటించారు. ఆమె లెజెండరీ నటి. ఆమెతో పనిచేయడం చాలా సంతోషాన్నిచ్చింది.
ఈ సినిమా మీకు ఎలాంటి అనుభవాన్ని ఇచ్చింది?
నేను యాక్షన్ సినిమాలు చేశాను, కానీ ఇంత కమర్షియల్ మాస్ ఫిల్మ్ ఇదే మొదటిసారి. ఇది నాకు కొత్త అనుభవం. ఆడియన్స్ స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రధాన ఆకర్షణ. ముగ్గురం కలిసి చేసిన ఇంటర్వెల్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చింది. ఆడియన్స్‌కు గొప్ప అనుభవం ఉంటుంది.
తెలుగు కోసం ఎలాంటి మార్పులు చేశారు?
కథాంశం అదే ఉంటుంది, కానీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు ప్రతి సీన్‌ను రీరైట్ చేశాం. ఒరిజినల్ కంటే మెరుగైన అనుభవాన్ని ఇస్తుంది.
హీరోయిన్స్ పాత్రలు ఎలా ఉంటాయి?
ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంది. వెట్రిమారన్ గారి కథలో ప్రతి క్యారెక్టర్ కీలకంగా ఉంటుంది.
శ్రీ చరణ్ సంగీతం గురించి?
శ్రీ చరణ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు పేరెన్నిక గలవాడు. ఈ సినిమాతో మంచి పాటలు కూడా ఇచ్చి నిరూపించుకున్నాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్.
నిర్మాత రాధామోహన్ గురించి?
రాధామోహన్ గారు ఇండస్ట్రీకి చాలా ముఖ్యమైన నిర్మాత. ముగ్గురు హీరోలతో సినిమా తీయడం సవాల్, కానీ ఆయన ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఈ సినిమాతో ఆయనకు భారీ విజయం, ఆర్థిక లాభం రావాలని కోరుకుంటున్నా.
డైరెక్టర్ విజయ్ గురించి?
విజయ్‌కు స్పష్టమైన విజన్ ఉంది. ఏ సీన్‌లో ఏం కావాలో ఆయనకు స్పష్టత ఉంటుంది. షూటింగ్ సమయంలోనే ఎడిటింగ్ పాటర్న్‌ను మైండ్‌లో ఉంచుకుంటారు. ఈ సినిమాతో ఆయన గొప్ప కమర్షియల్ డైరెక్టర్‌గా నిరూపించుకుంటారు.
నిర్మాతగా మరిన్ని సినిమాలు చేస్తారా?
నా కజిన్స్‌తో కలిసి ‘సుందరకాండ’ నిర్మిస్తున్నా. మంచి కథలు వస్తే ఖచ్చితంగా సినిమాలు నిర్మిస్తా.
‘అప్పట్లో ఒకడుండేవాడు’ సీక్వెల్ గురించి?
ఆ ఆలోచన ఉంది, కొంత పని కూడా జరిగింది, కానీ అది కార్యరూపం దాల్చలేదు. భవిష్యత్తులో జరగొచ్చు, చూద్దాం.
మీకు ఇష్టమైన జానర్?
హారర్ తప్ప అన్ని జానర్లు ఇష్టం. డబ్బులిచ్చి భయపడటం ఎందుకు? (నవ్వుతూ)
మీ కెరీర్‌లో ఇష్టమైన సినిమాలు?
సోలో, రౌడీ ఫెలో, బాణం, జో అచ్యుతానంద, అప్పట్లో ఒకడుండేవాడు.
‘భైరవం’ చూశారా?
మే 30న ఆడియన్స్‌తో కలిసి చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.
