NANI : ప్యారడైజ్ ఆగస్టు రిలీజ్ పోస్ట్ పోన్.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ప్యారడైజ్‘. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఈ సినిమాపై టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్యారడైజ్. అయితే ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 21న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అనుకున్న సమయానికి రావడం లేదు.
అదే డేట్ కు మైత్రి మూవీస్ నిర్మిస్తున్న రవితేజ లేటెస్ట్ సినిమా ఇరుముడి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ప్యారడైజ్ ఆలస్యానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఈ సినిమా ఇంకా సెకండ్ హాఫ్ షూటింగ్ పెండింగ్ ఉందని అది ఫినిష్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవడానికి కాస్త ఆలస్యం కావడం వల్లే సినిమా విడుదలను వాయిదా వేయాల్సి వచ్చినట్లు ఫిలిం నగర్ టాక్. ఆగస్టు 21న మిస్ అయిన ఈ సినిమా కేవలం కొన్ని వారాల గ్యాప్‌తో సెప్టెంబర్ మిడ్ వీక్ లో రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టు టార్గెట్ పెట్టుకుని షూటింగ్ ను జెట్ స్పీడ్ లో చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే ఈ కొత్త విడుదల తేదీపై చిత్ర నిర్మాణ సంస్థ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎంత ఆలస్యం అయిన ప్యారడైజ్ అవుట్‌పుట్ అదురుతుందని ఈ నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ప్యారడైజ్ నిలుస్తుందని యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!