Site icon NTV Telugu

Nani: బ్లడీ రోమియో మొదలెట్టేది అప్పుడే!

Nani

Nani

వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న నాని, సుజీత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. నిజానికి ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమైంది, కానీ పవన్ కళ్యాణ్ డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో సుజీత్ సినిమా మీదనే ఇంకా ఉండిపోవాల్సి వచ్చింది. ఈ నెలలో పెండింగ్ షూట్ పూర్తి చేసి, సినిమాని ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.

Read More: Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ఏంటి?

ఈ నేపథ్యంలో, దసరా తర్వాత సుజీత్-నాని సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోంది. షూటింగ్ మాత్రం వచ్చే ఏడాది చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ సినిమాకి బ్లడీ రొమియో అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. త్వరలోనే సినిమాని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. వెంకట్ బొయినపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించే అవకాశం ఉంది.

Read More: Arya@21: అల్లు అర్జున్’ను నిలబెట్టిన సినిమాకి 21 ఏళ్ళు

ఈ సినిమా అత్యధిక భాగం విదేశాల్లోనే షూట్ చేయాల్సి ఉంటుందని, నాని కెరియర్‌లోనే అత్యధిక భారీ బడ్జెట్ చిత్రంగా నిలవబోతుందని అంటున్నారు. నాని ముందుగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందాల్సిన ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ పూర్తి చేస్తాడు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఆ తర్వాత సుజీత్ సినిమాతో బిజీ అయ్యే అవకాశం ఉంది.

Exit mobile version