NTV Telugu Site icon

Naniodela2: ప్యారడైజ్ టైటిల్ లీక్ పై ఘాటుగా స్పందించిన దర్శకుడు..

Naniodela2

Naniodela2

నేచురల్‌ స్టార్‌ వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్ళాడు. ప్రస్తుత్తం నాని స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్న సినిమా HIT – 3. ఈ చిత్ర షూటింగ్ రాజస్థాన్ లో శరవేగంగా జరుగుతోంది. ఇక గతేడాది నానితో దసరా వంటి సూపర్ హిట్ తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నేచురల్ స్టార్. నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రానుంది ఆ చిత్రం.

Also Read : NBK109 : బాలయ్య బాబీ టీజర్ డేట్ ఇదే.. ఊచకోత మెుదలు

కాగా ఇటీవల ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. సికింద్రాబాద్ కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ది ప్యారడైజ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. పలు రకాల టైటిల్స్ ను పరిశీలించిన మీదట ఈ సినిమాకు ది ప్యారడైజ్ టైటిల్ అనుకున్నాక అది కాస్త సోషల్ మీడియాలో లీక్ అయింది. ఇప్పుడు ఈ విషయమై కాస్త ఘాటుగా స్పందించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.  తన వ్యక్తిగత ఖాతాలో ” ఇది ఎవరికి సంబంధించినది అయితే వారికోసం, నా సినిమాకే కాదు, ఎవరి సినిమాలో ఏ లీక్ అయినా అసిస్టెంట్ డైరెక్టర్స్ మరియు రైటర్స్ ని బ్లేమ్ చేయడం మానేస్తే బెటర్. వాళ్ళు భవిష్యత్తులో సినిమా కోసం ఎన్నో అద్భుతాలు చేయగల సృష్టికర్తలు. సినిమాకి వాళ్ళు పెట్టె నిస్వార్థమైనకష్టానికి అత్యంత గౌరవం ఇవ్వాలి. కష్టపడి పనిచేసే సినిమా విభాగాలపై నిందలు వేసే అలవాటును మార్చుకోండి మరియు మీ అత్యాశను అంగీకరించడం నేర్చుకోండి. నా సినిమా టైటిల్‌ను లీక్ చేసిన బాస్టర్డ్స్ నాకు తెలుసు. వాళ్ళు నా టీమ్‌కు చెందినవారు కాదు” అని ట్వీట్ చేసాడు.

Show comments