న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భిన్నమైన గెటప్స్‌లలో నాని కనిపించనున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ నటిస్తోన్న ఈ చిత్రాన్ని నిర్మాత వెంకట్ బోయనపల్లి రూపొందిస్తున్నారు. జీస్సూసేన్ గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథ అందించారు. మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి 70% షూటింగ్ పూర్తి కాగా… కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇటీవల సినిమా చిత్రీకరణ ఆగిపోయింది.
Read Also : అలా మనసు మార్చుకున్నానంటున్న హేమ!
తాజా అప్డేట్ ప్రకారం నాని ఈ చిత్రం పూర్తి షూటింగ్ ను వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారట. అందుకోసం మేకర్స్ ను ఒక లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేయమని కోరాడట. నాని జూలై మొదటి వారం నుండి షూటింగ్ ను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక కరోనా థర్డ్ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉందనే వార్తలు వస్తుండడంతో… ఎలాంటి రిస్క్ తీసుకోకుండా అంతలోపే తన ప్రాజెక్టుల షూటింగ్స్ పూర్తి చేయాలని నాని భావిస్తున్నాడట. కాగా త్వరలోనే థియేటర్లు రీఓపెన్ కానున్నాయి. ప్రస్తుతం నాని నటించిన “టక్ జగదీష్” విడుదలకు సిద్ధంగా ఉంది. “శ్యామ్ సింగ రాయ్” చిత్రీకరణ దశలో ఉండగా. ఆ తరువాత “అంటే సుందరానికి” అనే చిత్రంలో కూడా నాని నటించనున్నాడు.
