NTV Telugu Site icon

Nani: NTVతో కలిసి డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించిన నేచురల్‌స్టార్‌..

Untitled Design 2024 08 16t112901.245

Untitled Design 2024 08 16t112901.245

నేచురల్ స్టార్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘సరిపోదా శనివారం’. నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

Also Read: Pawan Kalyan : భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..?

కాగా ఆగష్టు 15న ఇండిపెండెన్స్ డే సంధర్భంగా యూసఫ్ గూడ ఫస్ట్ బెటాలియన్ పోలీసుల సమక్షంలో NTVతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు నేచురల్‌స్టార్‌ నాని. ట్రైనీ పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో యువతకు డ్రగ్స్ గురించి అవగాహన కల్పించాలని నాని ని కోరారు ఓ పోలీస్ అధికారి. ఆ ప్రశ్నకు సమాధానంగా నాని మాట్లాడుతూ ” చాలా మంది డ్రగ్స్ చెడు.. డ్రగ్స్ వల్ల యువత పాడైపోతారని చెప్పడమే తప్ప.. దాంతో వచ్చే సమస్యలు ఏమిటో ఎవ్వరూ చెప్పట్లేదు. అసలు వాటితో వచ్చే సమస్యలు ఏంటో తెలియకపోతో, అవి ఎందుకు చెడో అర్ధం కాదు. చాలా మంది పిల్లలు, యువత డ్రగ్స్ అంటే ఏంటో తెలుసుకోవడానికి మొదట తీసుకుని తరువాత బానిస అయిపోతున్నారు. కానీ అది వాస్తవానికి మనశ్శాంతిగా ఉండే మన జీవితంలో ఒకసారి దానికి అలవాటు అయితే అది తీసుకోకుండా ఏ పని చేయలేని పరిస్థితికి డ్రగ్స్ తీసుకెళ్తాయి. చాలా మంది తెలియక డ్రగ్స్ తీసుకుంటే ఎదో జాయ్ ఫీలింగ్ వస్తుంది అని అనుకుంటారు.. కానీ మీ జాయ్ ని, ఆనందాలను డ్రగ్స్ హరిస్తాయి. సినిమాలలో చూపించే విధంగా డ్రగ్స్ ఉండవని.. డ్రగ్స్ అంటే పాయిజన్” అని నాని తెలిపారు. అంతే కాకుండా ఎవరైనా డ్రగ్స్ చెడు.. డ్రగ్స్ మంచిది కాదు అనే కాక అవి ఏ రకంగా హాని కలిగిస్తాయో వివరించాలని సూచించారు.

Show comments