నాని హీరోగా నటిస్తున్న హిట్ 3 సినిమా ప్రమోషన్స్‌లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. నాని నిర్మాతగా హిట్ వన్, హిట్ టూ సినిమాలు రిలీజ్ సూపర్ హిట్ అయ్యాయి. అదే దర్శకుడితో ఇప్పుడు నాని హిట్ త్రీ అనే సినిమా చేశాడు. ఈ సినిమా మే ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ వేగంగా చేస్తోంది సినిమా యూనిట్. అందులో భాగంగా ఈ రోజు కేరళ వెళ్లిన సినిమా యూనిట్ అక్కడ ఒక ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కి హాజరైన ఒక కేరళ యువకుడు నానికి ఏకంగా ఒక కథ చెప్పాలని ముందుకొచ్చాడు. “నా దగ్గర ఒక కథ ఉంది, మీరు వింటాను అంటే చెబుతాను” అన్నాడు.
Jeethu Joseph: జీతూ జోసెఫ్.. ఆ స్పీడ్ ఏంటయ్యా?
వెంటనే నాని, “అలా కాదు, నీ దగ్గర ఏదైనా సినాప్సిస్ ఉందా?” అని అడిగాడు. వెంటనే ఆ యువకుడు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లి సినాప్సిస్ ఇవ్వగా, నాని దాన్ని తీసుకుని, “నేను తిరుగు ప్రయాణంలో దీన్ని చదువుతాను, బాగుంటే కచ్చితంగా మనం కలిసి పని చేద్దాం” అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. వెంటనే ఆ యువకుడు, “కచ్చితంగా చేద్దాం, మీరు నాకు ఒక హగ్ ఇవ్వగలరా?” అని అడిగితే, వెంటనే నాని హగ్ ఇచ్చాడు. కుర్రాడు థాంక్స్ చెప్పబోతూ ఉండగా, “అది నా బాధ్యత, ఒక నటుడిగా మంచి స్క్రిప్ట్ వెతికి పట్టుకోవడం నా బాధ్యత” అంటూ కామెంట్స్ చేశాడు నాని. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం తెలుగు హిస్టరీలోనే మోస్ట్ వైలెంట్ ఫిల్మ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోందనే ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.
