NTV Telugu Site icon

Nani : సరిపోదా శనివారం’ చాలా లాంగ్ రన్ వుండే సినిమా: నేచురల్ స్టార్ నాని

Untitled Design (8)

Untitled Design (8)

నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ నిర్వహించింది.

నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. 15 రోజులు గా టీంలో ఎవరికీ నిద్రలేదు. అప్పుడు పని చేసే ఒత్తిడితో నిద్ర లేదు. ఈ మూడు రోజులు గా సక్సెస్ ఎక్సయిట్మెంట్ తో నిద్రలేదు. రిలీజ్ రోజు నుంచి ఎన్నో అభినందనలు, ప్రసంశలు వస్తున్నాయి. సినిమాని మీరంతా ఆదరిస్తాని తెలుసు. థియేటర్ లో అందరితో కలసి ఆడియన్స్ ఎనర్జీ చూసినప్పుడు మేము ఇంకా తక్కువగా అంచనా వేశామనిపించింది. సినిమా బావుంటే తెలుగు ఆడియన్స్ తలమీద పెట్టుకుంటారని మరోసారి ప్రూవ్ చేసినందుకు థాంక్ యూ సో మచ్. ఇంత వర్షం లో కూడా అన్నీ చోట్ల హౌస్ ఫుల్స్ అవుతున్నాయంటే వి హేవ్ గ్రేటెస్ట్ ఆడియన్స్ ఇన్ ది వరల్డ్. ఆడియన్స్ అందరికీ థాంక్స్. మా టీం అందరి తరపున ఆడియన్స్ కి థాంక్స్ చెప్పడానికి కలిశాం.

Also Read: 35 MovieTrailer : 35 చిన్న కథ కాదు.. కానీ ట్రైలర్ మాత్రం పెద్దదే..

సరిపోదా శనివారం’ నాట్ వీకెండ్ ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ హియర్ ఫర్ లాంగ్ కాల్. లాంగ్ రన్ వుండబోతోంది. హెవీ రైన్స్ వుండి ఈ వీకెండ్ చూడలేకపోతే ఎలా ని భయపడకండి, ఎప్పుడు కుదిరితే అప్పుడు చూడండి. ఎస్జే సూర్య పెర్ఫర్ఫార్మెన్స్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీ అందరికి కంటే ముందు సెట్ లో ఆయన పెర్ఫార్మెన్స్ ని ఎంజాయ్ చేశాను. వివేక్ విషయంలో చాలా ప్రౌడ్ గా వుంది. అంటే సుందరానికీ రావాల్సిన బాక్సాఫీసు సక్సెస్ రాలేదనే చిన్న వెలితి వుండేది. అది కాస్త ‘సరిపోదా శనివారం’తో బ్యాలన్స్ అయిపొయింది. సెప్టెంబర్ 5న ‘సరిపోదా శనివారం’ గ్రాండ్ సెలబ్రేషన్స్ ఈవెంట్ వుంటుంది” అని అన్నారు.

Show comments