NTV Telugu Site icon

Nani : ఆ నాని సినిమా లేనట్టే?

Nani

Nani

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలు లైన్ లో పెట్టినట్టు సంగతి తెలిసిందే. చివరిగా సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు హిట్ 3 అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దాదాపుగా సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతానికి ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక ఆయన శ్రీకాంత్ ఓదల దర్శకత్వంలో ది పారడైజ్ అనే సినిమా చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి కాబట్టి ఏప్రిల్ నెల నుంచి ఈ సినిమా షూటింగ్ ఉండే అవకాశం ఉంది.

Vijayasai Reddy: విజయ సాయిరెడ్డికి మంగళగిరి సీఐడీ పోలీసులు నోటీసులు

అయితే నాని సుజిత్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది కానీ సుజిత్ పవన్ కళ్యాణ్ ఓజి సినిమా హడావుడిలో ఇరుక్కుపోవడంతో శిబి చక్రవర్తి తో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాని. తమిళంలో డాన్ లాంటి సినిమా చేసిన తర్వాత చాలామంది నిర్మాతలు శిబి కి మంచి అడ్వాన్సులు ఇచ్చారట. అయితే అక్కడ తమిళంలో స్టార్ హీరోలు ఎవరూ దొరకకపోవడంతో మనోడు నానితో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. కానీ ఇప్పుడు తమిళ నిర్మాతలు తమ సినిమా కాకుండా వేరే సినిమా చేయాలంటే గట్టిగా నష్టపరహారం ఇచ్చి సినిమాలు చేసుకోమని చెప్పారట. ఆ నష్టపరిహారాలు మైత్రి మూవీ మేకర్స్ కట్టాల్సి వచ్చే పరిస్థితులు ఏర్పడడంతో ప్రస్తుతానికి అది వర్కౌట్ అయ్యే ప్లాన్ కాదని సినిమా పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. కాబట్టి నానికి ప్రస్తుతానికి ది పారడైజ్ మాత్రమే లైన్లో ఉన్నట్టుగా ఉంది అది పూర్తయ్యాక వేరే సినిమాల మీద ఫోకస్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.