నాని హీరోగా నటిస్తున్న “హిట్: థర్డ్ కేస్” సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన పహల్గాం అనే ప్రాంతంలో జరిగింది. తాజాగా ఈ విషయాన్ని నాని ముందు ప్రస్తావించగా, ఆయన స్పందిస్తూ, నిజానికి పహల్గాంలో కాల్పులు జరిగిన ప్రాంతంలో కాదు, కానీ ఆ చుట్టుపక్కల చాలా చోట్ల షూటింగ్ జరిపామని తెలిపారు. సుమారు పది రోజులపాటు ప్రశాంతంగా షూటింగ్ జరిగిందని, కానీ ఆ తర్వాత మా టీమ్ మెంబర్ ఒకరు మరణించారని ఆయన బాధపడ్డారు. సినిమాటోగ్రాఫర్ అసిస్టెంట్ కృష్ణ అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసినట్లు ఆయన వెల్లడించారు.
Read More: Jailer 2: రజనీ కోసం ‘బాలయ్య’ నడిచొస్తే ఉంటది “నా సామిరంగా”!
ఆమె వయసు 28 సంవత్సరాలు అని, చాలా టాలెంటెడ్ టెక్నీషియన్ అని నాని చెప్పుకొచ్చారు. ఈ సినిమాను ఆమెకు డెడికేట్ చేస్తున్నట్లు నాని వెల్లడించారు. నిజానికి ఆమెను ఐసీయూలో చేర్చామని, తర్వాత జనరల్ వార్డుకు కూడా తరలించామని అన్నారు. ఆమె అన్నను, అమ్మను శ్రీనగర్‌కు రప్పించి మంచి ట్రీట్‌మెంట్ ఇప్పించామని, అయితే షూట్ ప్యాకప్ చేసుకుని హైదరాబాద్‌కు వచ్చి ల్యాండ్ అయిన వెంటనే ఆమె కన్నుమూసిన విషయం తమకు తెలిసిందని చెప్పుకొచ్చారు. పహల్గాంతో షూట్ మెమరీస్ ఉంటూనే, ఆమె తమకు దూరమైన బాధ కూడా వెంటాడుతోందని నాని వెల్లడించారు.
Read More: Visakha Rain: విశాఖలో మళ్లీ వర్షం.. సింహాచలంలో భక్తుల దర్శనానికి ఇక్కట్లు
