నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది పారడైజ్ అనే సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ లీక్ అయింది. తర్వాత ఈ మధ్యనే రా స్టేట్మెంట్ అంటూ సినిమా గ్లింప్స్ ఒకదానిని రిలీజ్ చేశారు. అందరికీ ఇదొక షాకింగ్ ఫ్యాక్టర్ లా తగిలింది. ఎందుకంటే మామూలుగా రోజువారీ సంభాషణలోనే ఈ పదం దొర్లితే ఒకసారి అందరూ షాక్ అవుతారు. అలాంటిది టాలీవుడ్ లో ఒక మంచి మార్కెట్ ఉన్న హీరోని సదరు బూతు పదంతో ప్రస్తావిస్తూ కట్ చేసిన గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో నాని ఒక వేశ్య కుమారుడి పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే సినిమా టైటిల్ పారడైజ్ అనగానే ఇదేదో స్వర్గ లోకం నరక లోకం అంటూ భిన్నమైన ఆలోచనలు కలగడం అందరికీ సహజమే.
Hyderabad: స్థలం కబ్జాకు స్కెచ్.. ల్యాండ్ గ్రాబర్స్ ముఠా అరెస్ట్
అయితే ఈ ప్యారడైజ్ అనే పేరు పెట్టడానికి కారణం సికింద్రాబాద్ లో ఉన్న ప్యారడైజ్ సర్కిల్ అని తెలుస్తోంది. నిజాం పరిపాలన నుంచి హైదరాబాద్ భారతదేశంలో విలీనమైన తర్వాత హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ ఆబిడ్స్ వంటి ప్రాంతాలను హార్ట్ ఆఫ్ ది సిటీగా పరిగణిస్తే కాస్త దూరంగా సికింద్రాబాద్ కు దగ్గరగా ఉన్న పేరడైజ్ను మాత్రం బస్తీ అంటే ఒక రకంగా స్లమ్ ఏరియాగా ప్రస్తావించేవారు. ఈ కథ కూడా అదే బస్తీలో ప్రారంభమయ్యే కథగా తెలుస్తోంది. 1950లలో మొదలై 83 అంటే ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గద్దె నెక్కేవరకు ఈ కథ సాగబోతుందని తెలుస్తోంది. నిజానికి చార్మినార్ ను టైటిల్లో ఇంక్లూడ్ చేయడం గమనించారు కానీ ఎక్కువమంది పారడైజ్ అంటే ఈ పేరడైజ్ సర్కిల్ అనే గుర్తు పట్టలేకపోయారు. కానీ తాజాగా నాని, శ్రీకాంత్ ఓదెల ఇస్తున్న ఇంటర్వ్యూల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది..
