సినిమాలు పోస్ట్ అవడం అనేది సహజం. ఇతర నటీనటుల డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోవడమో, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండడం, విఎఫెక్స్ ఆలస్యం ఇలా రకరకాల కారణాలతో సినిమాల రిలీజ్ వాయిదా వేయడం అనేది తరచూ చూస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా టాలీవుడ్ లో వాయిదాల పర్వం ఎక్కువగా నడుస్తుంటుంది. ఇటీవల తెలుగులో భారీ బడ్జెట్ చిత్రాలు ఏవి అనుకున్న టైమ్ కి రిలీజ్ కాలేక పోస్ట్ పోనే అవుతూ వస్తున్నాయి.
Also Read: Kantara Chapter1: కాంతార కోసం ఎవరూ చేయని పని చేస్తున్న రిషబ్ శెట్టి.. ?
ఈ వాయిదాల పర్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు నేచురల్ స్టార్. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప -2 ఆగస్టు 15న రిలీజ్ కావాల్సింది కానీ డిసెంబర్ 6కి వాయిదా వేయాల్సి వచ్చింది. అలాగే న జూనియర్ ఎన్టీయార్ నటిస్తున్న దేవర ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సింది కానీ ఇప్పుడు సెప్టెంబరు 27న రిలీజ్ అవుతోంది. ఇలా భారీ బడ్జెట్ సినిమాలు పోస్ట్ పోన్ అవుతుండడంపై నాని సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ” క్లారిటీ లేకుండా రిలీజ్ డేట్ ప్రకటించడం వలన చాలా మంది నష్టపోతున్నారు ఓక డేట్ వేసేద్దాం, సినిమా రెడీ అయితే ఆ డేట్ కు వద్దాం లేదంటే తర్వాత చూసుకుందాం అనే ఆటిట్యూడ్ కకరెక్ట్ కాదు” అని అన్నాడు. నాని చేసిన ఈ వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. పుష్ప ఆగస్టు కి వచ్చేస్తున్నారని డిసెంబర్ లో తండేల్, రాబిన్ హుడ్, కన్నప్ప వంటి సినిమాలు డిసెంబర్ రిలీజ్ డేట్ వేసారు. తీరా ఇప్పడు పుష్ప డిసెంబర్ అనడం తో ఈ సినిమాల రిలీజ్ పై తర్జన భర్జన మొదలైంది. ఏది ఏమైనా నాని చెప్పిన నూటికి నూరుపాళ్లు నిజం