NTV Telugu Site icon

Nani: చిరంజీవి,ఓదెల కాంబో మూవీపై అప్డేట్ ఇచ్చిన నాని

February 7 2025 02 22t104714.289

February 7 2025 02 22t104714.289

ఇండస్ట్రీలో ఎవ్వరి సపోర్ట్ లేకుండా చిన్న స్థాయి నుంచి నేచుర‌ల్ స్టార్ గా ఎదిగాడు నాని. హీరోగా తాను ఎలా అయితే సూప‌ర్ స‌క్సెస్‌ అయ్యాడో నిర్మాత‌గానూ అంతే. తన వాల్ పోస్టర్ బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన ఏ సినిమా అయిన  ప్రేక్షకుల్నీ నిరుత్సాహ‌ప‌ర‌చ‌దు. ఇక హీరోగా ప్రజంట్ వరుస సినిమాలు తీస్తూనే.. నిర్మాతగా చిన్న సినిమాల్ని మంచి ప్లానింగ్ తో తీస్తున్నాడు నాని. వాటిని ప్రమోట్ చేసుకునే విధానం కూడా బాగుంటుంది. ఇక ఈ వాల్ పోస్టర్ బ్యాన‌ర్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా ‘కోర్ట్‌’. ప్రియద‌ర్శి క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమా మార్చి 14న విడుద‌ల అవుతోంది.

Also Read:Emergency: ‘ఎమర్జెన్సీ’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన కంగనా!

అయితే  యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నా ప్రాజెక్ట్‌ను నాని తన సొంత బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేయనున్నా విషయం తెలిసిందే. ఇక ‘కోర్ట్’ మూవీప్రమోష‌న్లు మొద‌లు పెట్టిన నాని.. రీసెంట్ గా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో చిరు-ఓదెల ప్రాజెక్ట్‌పై ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు.చిరంజీవితో శ్రీకాంత్ చేయబోయే ప్రాజెక్టు వచ్చే సంవత్సరంలో రానుందని ఆయన వెల్లడించారు.

ఇక ఇప్పటికే ‘కోర్టు’ సినిమా ఓటీటీ డీల్  క్లోజ్ అవ్వగా, దాదాపు రూ.9 కోట్లు నెట్ ఫిక్స్ సంస్థ ఈ సినిమాను కొనేసింది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే. మొత్తం రూ.6 కోట్లలో ‘కోర్ట్’ సినిమా పూర్తవగా ఓటీటీ డీల్ తోనే ఈ మూవీ ఇప్పుడు రూ.3 కోట్లు లాభం పొందింది. ఇది కేవ‌లం ఓటీటీ డీల్ మాత్రమే. శాటిలైట్ డీల్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. థియేట‌ర్ నుంచి వ‌చ్చిందంతా లాభ‌మే. రిలీజై మంచి టాక్ వస్తే నానికి మంచి కలెక్షన్స్ లు వస్తాయి.