NTV Telugu Site icon

Nani : ‘ది ప్యారడైజ్’ నుండి మరో పోస్టర్ రిలీజ్..

Nani (3)

Nani (3)

నేచురల్ స్టార్ నాని ప్రజంట్ హీరోగా, నిర్మాతగా ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. చివరగా ‘దసరా’ మూవీతో వచ్చిన నాని ప్రజంట్ వరుస సినిమాలు లైన్ పెట్టాడు. అందులో ‘ది ప్యారడైజ్’ మూవీ ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి, ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్ లో నాని తన లుక్ తో షాక్ ఇచ్చాడు. రెండు జడలతో రా అండ్ రస్టిక్‌ లుక్​లో కనిపించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాసిర్రు గానీ, గదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ. జమానా జమానా కెళ్లి నడిచే శవాల కథ. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం బోసి పెంచిన ఓ జాతి కథ’ అంటూ వీడియోలో వినిపించిన వాయిస్‌ ఓవర్‌, అందులో కనిపించిన విజువల్స్‌ ఎంతో ఆకట్టుకున్నాయి. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

Also Read: Star directors : బాలీవుడ్‌‌ని మోతమోగిస్తున్న సౌత్‌ డైరెక్టర్స్‌

ఇక ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, స్పానిష్‌ లాంటి విదేశీ భాషల్లోనూ, వచ్చే ఏడాది మార్చి 26న ఒకేసారి విడుదల కానుంది. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నా ఈ మూవీకి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రొడక్షన్‌ డిజైనర్‌ అవినాశ్‌ కొల్లా పనిచేస్తున్నారు. అయితే ఈ రోజు మార్చి 26 కావడంతో.. తాజాగా మూవీ టీం సోషల్ మీడియాలో ‘ది ప్యారడైజ్’ నుండి ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో నాని వైల్డ్‌గా కనింపించాడు. ఈ రోజుతో ఇంకా 365 డేస్ మాత్రమే అనే క్యాప్షన్ తో ప్రజంట్ ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.