Site icon NTV Telugu

Nandamuri Mokshagna : మీ అంచనాలకు మించి ఇంట్రడక్షన్ షాట్!

Nandamuri Mokshagna

Nandamuri Mokshagna

Nandamuri Mokshagna Intresting Tweet on Prashanth Varma: నందమూరి మోక్షజ్ఞ తేజ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా? అని ఎదురుచూస్తున్న నందమూరి అభిమానుల కలలు అన్నీ నిజమయి త్వరలోనే ఆయన సినీ రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధం చేసుకుంటున్నాడు. మొదటి సినిమా ప్రశాంత్ వర్మతో ఫిక్స్ అవడం ఇప్పటికే అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి బయటకు వస్తున్న లీక్స్ అయితే అల్టిమేట్ గా అనిపిస్తున్నాయి. తాజాగా నందమూరి మోక్షజ్ఞ తేజ అఫీషియల్ అనే ఒక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఇంట్రడక్షన్ షాట్ అయితే వేరే లెవెల్ లో ఉందని ప్రశాంత్ వర్మకి దండం పెడుతూ ఒక ట్వీట్ చేశారు.

Aman Singh: పెళ్లి చేసుకుంటానని రేప్.. టాలీవుడ్ నటుడిపై కేసు

ఆ సినిమా స్టోరీ, ఎలివేషన్స్, హై మూమెంట్స్ అన్నీ చూసుకుంటే కచ్చితంగా మీ అంచనాలకు మించి ఊహలకు అందని విధంగా ఉంటుందంటూ ట్వీట్ చేశారు. దీంతో నందమూరి అభిమానులు ఎప్పుడు ఈ సినిమా వస్తుంది అని ఎదురు చూస్తున్నాం అంటూ సదరు ట్వీట్ కి కామెంట్లు పెడుతున్నారు. అయితే గతంలో కూడా ఈ అకౌంట్ నుంచి అనేక పోస్టులు వచ్చాయి కానీ ఇది అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఏనా కాదా అనే విషయం మీద క్లారిటీ లేదు.

Exit mobile version