Nandamuri Mokshagna : నేడు చిన్న సింబా బర్త్ డే.. ఎంట్రీ అప్డేట్ ఉంటుందా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్లో ఆయన సినీ ఎంట్రీపై మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. చాలా కాలంగా మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం గురించి అనేక రకాల వార్తలు వస్తున్నప్పటికీ, ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో నందమూరి అభిమానులు మోక్షు ఫస్ట్ మూవీ అనౌన్స్మెంట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
గతంలో హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో సినిమా అనుకుని ఆగిపోయింది. ఆ తర్వాత పలువురు ప్రముఖ దర్శకుల పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ అవేవి కార్యరూపం దాల్చలేదు. అయితే ప్రస్తుతం ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో మోక్షజ్ఞ తన మొదటి సినిమా చేయబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నటసింహం బాలకృష్ణ సుమారు 15 నిమిషాల నిడివి ఉన్న ఓ పవర్ ఫుల్ కేమియో రోల్లో కనిపించనున్నారని కూడా రూమర్ వినిపిస్తోంది. అంతేకాకుండా మోక్షజ్ఞ సరసన కథానాయికగా టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీలను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.నేడు మోక్షజ్ఞ బర్త్ డే కావడం, పైగా ఈ ప్రాజెక్ట్‌పై సస్పెన్స్ కొనసాగుతుండటంతో.. ఈ రోజే ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఏమైనా అఫీషియల్ అప్డేట్ వస్తుందా లేదా అనేది హాట్ టాపిక్‌గా మారింది. బాలకృష్ణ తన కుమారుడి ఎంట్రీ విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటుండటంతో, అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..