NTV Telugu Site icon

Unstoppable 2: బాలయ్య-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ షూటింగ్ షురూ…

Nbk Pspk

Nbk Pspk

రెండు పవర్ హౌజ్ లు కలిస్తే ఎలా ఉండబోతుందో చూపించడానికి అన్ స్టాపబుల్ సీజన్ 2 వేదిక సిద్ధమవుతోంది. నట సింహం నందమూరి బాలకృష్ణలోని కొత్త యాంగిల్ ని ఆడియన్స్ ని పరిచయం చేసిన ఈ టాక్ సీజన్ 2 లాస్ట్ ఎపిసోడ్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. తరతరాలుగా మెగా నందమూరి అభిమానుల మధ్య ఇండస్ట్రీ పరంగా ఒక రైవల్రీ ఉంది. వచ్చే సంక్రాంతికి కూడా ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాల కారణంగా మెగా నందమూరి ఫ్యాన్ వార్ జరగబోతోంది. ఈ వార్ బాక్సాఫీస్ వరకు మాత్రమే ఉంటుందని నిరూపిస్తూ పవన్ కళ్యాణ్, బాలకృష్ణలు ఒకే వేదికపై కనిపించబోతున్నారు. సీజన్ 2కి ఎండింగ్ ఎపిసోడ్ లా పవన్ కళ్యాణ్, బాలయ్యల ఎపిసోడ్ ని టెలికాస్ట్ చెయ్యనున్నారు. ఈ క్రేజీ ఎపిసోడ్ షూటింగ్ ఈరోజు స్టార్ట్ అయ్యింది. గ్రాండ్ స్కేల్ లో చేసిన ఏర్పాట్లు మధ్య పవన్ కళ్యాణ్ ని బాలయ్య, అల్లు అరవింద్ లు రిసీవ్ చేసుకున్నారు. ఇదే ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా కనిపించనున్నాడు. ఇప్పటివరకూ అన్ స్టాపబుల్ కోసం చాలా మంది గెస్టులు వచ్చారు కానీ ఏ హీరోకి చెయ్యనంత గ్రాండ్ సెలబ్రేషన్స్ ని పవన్ కళ్యాణ్ కోసం చేస్తున్నారు ‘ఆహా మేనేజ్మెంట్’.

పవర్ స్ట్రామ్ లాంటి పవన్ కళ్యాణ్, ఎనేర్జిని సినానిమ్ లా ఉండే బాలయ్యలు కలిసి సినిమా విషయాలు మాట్లాడుకుంటారా? లేక రాజకీయాల గురించి మాట్లాడుకుంటారా? ఫ్యామిలీ రైవల్రీ గురించి మాట్లాడుకుంటారా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఎందుకంటే చరణ్, ఎన్టీఆర్ లాంటి ఈ జనరేషన్ హీరోలు కలిసి సినిమాలు చేస్తున్నారు, ఫ్రెండ్లీగా ఉంటున్నారు కానీ గత జనరేషన్ హీరోలైన చిరు, బాలయ్యలు చాలా రేర్ గా కలుస్తూ ఉంటారు. ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఉందనేది కొందరి మాట. అది నిజమో కాదో తెలియదు కానీ ఇద్దరు టాప్ హీరోల మధ్య పోటీ ఉంటుంది అనే విషయం అందరూ అర్ధం చేసుకోగల అంశమే. మరి ఆ మెగాస్టార్ తమ్ముడిగా, జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్… టీడీపీ ఎమ్మెల్యే, చిరుకి ప్రొఫెషనల్ రైవల్రీ అయిన బాలకృష్ణతో ఎలా మాట్లాడుతాడు? రిజర్వ్ గా ఉండే పవన్ కళ్యాణ్ తో బాలయ్య ఎలాంటి ఫన్ జనరేట్ చేస్తాడు? చంద్రబాబు నాయుడుని స్వర్గీయ నందమూరి తరకరమావు గురించి అడిగినట్లే, అల్లు అరవింద్ ని నెపోటిజం గురించి అడిగినట్లే, పవన్ కళ్యాణ్ ని వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న మూడు పెళ్లిల కామెంట్స్ గురించి బాలయ్య ప్రశ్నిస్తాడా అనేది చూడాలి.

Show comments