NBK 111: ఈసారి రెగ్యులర్ మాస్ కాదు.. నెక్స్ట్ లెవెల్ ఇంటెన్స్ అవతారంలో ‘గాడ్ ఆఫ్ మాసెస్’!

Adhika Masa Purnima (8)

Adhika Masa Purnima (8)

NBK 111: గోపీచంద్ మలినేని – నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న #NBK111 క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక సంచలన అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి సంబంధించిన ఒక విభిన్నమైన పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ద్వారా ‘గాడ్ ఆఫ్ మాసెస్’ బాలకృష్ణను ఆయన రెగ్యులర్ క్లాసిక్ స్టైల్‌కు భిన్నంగా, మునుపెన్నడూ చూడని రీతిలో ఎంతో ఇంటెన్స్ అండ్ పవర్‌ఫుల్ లుక్‌లో చూపించబోతున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చారు. 2023లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘వీరసింహారెడ్డి’ తర్వాత నందమూరి బాలకృష్ణ – దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండవ చిత్రం ఇది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అటు ఇండస్ట్రీ వర్గాల్లో, ఇటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా, మంచు మనోజ్, అరవింద్ కాశ్యప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన హై – వోల్టేజ్ యాక్షన్ షెడ్యూల్ ముంబై పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుగుతోంది. హాలీవుడ్ రేంజ్ స్టంట్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్లను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ మోస్ట్ అవేటెడ్ చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2027లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య బాబు కెరీర్‌లోనే ఒక సరికొత్త మోడరన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా నిలవబోతున్న ఈ సినిమాకు సంబంధించి.. జూన్ 10న ఒక భారీ అప్‌డేట్ లేదా టైటిల్ గ్లింప్స్‌ను రివీల్ చేయబోతున్నారు. బాలకృష్ణ సరికొత్త మాస్ అవతార్ చూడటానికి నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి గోపీచంద్ మలినేని మార్క్ ఎలివేషన్స్, బాలయ్య సరికొత్త మాస్ అవతార్ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.

×
×
Ad