NTV Telugu Site icon

అభిమానుల‌కు బాల‌కృష్ణ సందేశం!

Nandamuri Balakrishna Message to Fans

జూన్ 10వ తేదీ నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన రోజు. కొన్ని ద‌శాబ్దాలుగా అభిమానుల స‌మక్షంలో పుట్టిన‌రోజు జరుపుకుంటున్నారు బాల‌య్య‌. ఎన్నో సంవ‌త్స‌రాలు ఆయ‌న సినిమా షూటింగ్ లోనే ఈ వేడుక‌ను జ‌రుపుకునే వారు. రాష్ట్రంలోనే కాదు రాష్ట్రేత‌ర ప్రాంతంలో బాల‌కృష్ణ ఉన్నా… పుట్టిన‌రోజును ఆయ‌న‌ను క‌లిసి, అభినందించి రావ‌డం అనేది అభిమానులుకు ఆన‌వాయితీగా మారిపోయింది. అయితే క‌రోనా స‌మ‌యంలో అలాంటి ప‌నుల‌ను చేయ‌వ‌ద్దంటూ బాల‌కృష్ణ హిత‌వు ప‌లుకుతూ ఓ సందేశాన్ని సోష‌ల్ మీడియా మాధ్య‌మంగా అభిమానుల‌కు తెలియ‌చేశారు. అదే ఇది!
……….
నా ప్రాణ సమానులైన అభిమానులకు ..
ప్రతిఏటా జూన్ 10 వతేదీ నాపుట్టినరోజునాడు ..
నన్ను కలిసేందుకు నలుదిక్కులనుండీ తరలివస్తున్న మీ అభిమానానికి
సర్వదా విధేయుడ్ని ..
కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు ..
నన్నింతటివాడ్ని చేసింది మీ అభిమానం
.. ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను ..
మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు
మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు
మీ కుటుంబం తో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదినవేడుక ..
దయచేసి రావద్దని మరీ మరీ తెలియజేస్తూ ..
ఈ విపత్కాలంలో అసువులు బాసిన
నా అభిమానులకూ కార్యకర్తలకూ అభాగ్యులందరికీ నివాళులర్పిస్తూ ..
మీ నందమూరి బాలకృష్ణ ..