NTV Telugu Site icon

పీనట్ డైమండ్ : ‘నఖశిఖముని’ లిరికల్ వీడియో సాంగ్

Nakashikamuni lyrical song from Peanut Diamond out now

అభినవ్ సర్దార్ పటేల్, రామ్ కార్తీక్, చాందిని తమిళరసన్, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా ‘పీనట్ డైమండ్’. ఈ చిత్రంతో వెంకటేష్ త్రిపర్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎఎస్పి మీడియా హౌస్, జీవీ ఐడియాస్ బ్యానర్ లపై అభినవ్ సర్దార్, వెంకటేష్ త్రిపర్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నఖశిఖముని’ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్.రామ్ కార్తీక్, షెర్రీ అగర్వాల్ లపై చిత్రీకరించిన ఈ రొమాంటిక్ సాంగ్ ను స్వాతి రెడ్డి ఆలపించారు. సురేష్ ఉపాధ్యాయ లిరిక్స్ అందించారు. మీరు కూడా ‘నఖశిఖముని’ రొమాంటిక్ లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.