చిరంజీవి విశ్వంభర, అనిల్ రావి పూడి చిత్రాలతో బిజీ. బాలకృష్ణ అఖండ2 ఫైనల్ దశకు చేరుకోబోతోంది. వెంకటేష్ కాస్త బ్రేక్ తీసుకుని త్రివిక్రమ్, దృశ్యం3తో పాటు మరో త్రీ ఫిల్మ్ సెట్ చేశాడు. చిరంజీవి, బాలయ్య సినిమాలో క్యామియో అప్పీరియన్స్‌తో చెలరేగిపోతున్నాడు. కింగ్ నాగార్జున సంగతేంటీ. సోలో హీరోగా మళ్లీ కనిపించేది ఎప్పుడు. అని టెన్షన్ పడుతున్న నాగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నాడు. తన మైల్ స్టోన్ మూవీకి డైరెక్టర్‌ను ఫిక్స్ చేశాడు. ఆకాశం ఫేం రా కార్తీక్‌కు ఛాన్స్ ఇచ్చినట్లు గట్టిగానే బజ్ వినిపిస్తోంది.
Also Read : WAR 2 : వార్ 2 US ప్రీమియర్స్.. యంగ్ టైగర్ ఊచకోత చూస్తారు
నాగ్ తన వందవ చిత్రం కోసం ఆకాశం తప్ప మరో సినిమా చేయని రా కార్తీక్‌కు ఛాన్స్ ఇవ్వడం డేరింగ్ డెసిషనే. తమిళ నటుడు శశి కుమార్ నటించిన అయోతిని రీమేక్ చేయబోతున్నాడని గత కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇదే ఫ్యాన్స్ ను కాస్త కలవరపెడుతోంది. ఈ మధ్య కాలంలో నాగార్జునకు రీమేక్స్ కలిసి రావడం లేదు. నాగ్ రీమేక్స్ చేయడం కొత్త కాదు. తన ఫస్ట్ ఫిల్మ్ విక్రమ్ నుండే చాలా సినిమాలు రీమేక్ చేశాడు. ఇప్పుడు వందవ చిత్రాన్నీ సెంటిమెంట్‌గా భావించి రీమేక్ లోడ్ చేయాలన్న యోచనలో పడినట్లున్నాడు కింగ్. కానీ ఈ మధ్య కాలంలో ఆయనకు రీమేక్స్ పెద్దగా అచ్చిరావడం లేదు. మన్మధుడు2, లాస్ట్ ఇయర్ వచ్చిన నా సామి రంగా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. సో అయోతి రీమేక్ చేయడమన్నదీ పెద్ద రిస్కే. అందులోనూ ఈ ఓటీటీ యుగంలో ఇలాంటి ప్రయోగం చేయాలనుకోవడం కూడా నాగ్ ముందున్న అతి పెద్ద ఛాలెంజ్. మరీ సెంటిమెంట్ కోసం రీమేకే నమ్ముకుంటాడా లేక సరికొత్త స్టోరీని ప్లాన్ చేస్తాడా అనేది రాబోయే రోజుల్లో క్లారిటి వస్తుంది.
