Site icon NTV Telugu

Nagarjuna : తమిళ రీమేక్‌పై కన్నేసిన నాగ్.. 100వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..?

Nagarjuna

Nagarjuna

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా విడుదలైన ‘కుబేర’ చిత్రంతో మరోసారి తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో ఆయన చేసిన పవర్‌ఫుల్ పాత్రకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. దీంతో, ఈ తరహా పాత్రలు చేయాలన్న ఆసక్తి ఆయనలో మళ్లీ చిగురించిందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు నాగార్జున తన 100వ సినిమాను ఓకే చేసినట్లు సమాచారం. ఇది మాత్రమే కాకుండా, నాగార్జున మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌ను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read : Siva Shakthi Datta : జక్కన్న ఫ్యామిలి‌లో తీవ్ర విషాదం..

తమిళంలో శశి కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ హ్యుమన్ డ్రామా ‘అయోతి’ తెలుగులో రీమేక్ అయ్యే అవకాశం ఉందని టాక్. ఈ కథను విని నాగార్జున ఆసక్తిగా ఉన్నారు, త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని సమాచారం. ఈ రీమేక్‌ను ట్రిడెంట్ ఆర్ట్స్ బ్యానర్ నిర్మించనుంది. ఈ రెండు సినిమాలపై అధికారిక ప్రకటనలు రావాల్సి ఉన్నా, నాగ్ తన బర్త్‌డే ఆగస్టు 29న అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్నారు. ఒకవేళ ఇది నిజమైతే, నాగార్జున 100వ సినిమా ప్రకటించడంతో పాటు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ గురించి క్లారిటీ ఇవ్వబోతున్నాడన్నమాట.

Exit mobile version