Site icon NTV Telugu

Nagarjuna : లోకేష్, శేఖర్‌ల డైరెక్షన్ పై స్పందించిన నాగ్ ..

Coolie Vs Kubera Roles, Nagarjuna Interviews

Coolie Vs Kubera Roles, Nagarjuna Interviews

నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో హీరోగా మెప్పించిన అక్కినేని నాగార్జున.. ప్రజంట్ ఆయన ఎంచుకుంటున్న పాత్రలు సాహసంతో కూడుకున్నదని చెప్పాలి. రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘కూలీ’లో ఆయన విలన్‌గా కనిపించనున్నరు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ‘సైమన్’ అనే పవర్‌ఫుల్ నెగెటివ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. అయితే

Also Read : Manchu Manoj : ‘ఆవేశం’ రీమేక్ చేయాలనుకున్న..

ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో, ఈ పాత్రకు ముందు జరిగిన చర్చలు నాగ్ గుర్తు చేసుకున్నారు.. ‘లోకేష్ కథ వినిపించాలని వచ్చాడు. కానీ, ముందుగా ‘మీకు విలన్ పాత్ర చేయడం సౌకర్యంగా ఫీలవుతారా? నచ్చకపోతే ఓ కప్పు టీ తాగి వెళ్తాను’ అని అన్నారు. కానీ నాకు ఆ ఆలోచనే ఆసక్తిగా అనిపించింది. వెంటనే స్క్రిప్ట్ చెప్పమన్నాను. కథ విన్న తర్వాత చాలా ఎగ్జైట్ అయ్యాను. ఆ తర్వాత కూడా లోకేష్‌కు ఏడు సార్లు ఫోన్ చేశాను. సెట్‌లో కూడా లొకేష్ తరచూ ‘పులిలా నడవండి’ అని అడిగేవాడు. అదే సమయంలో, ‘కుబేరా’ దర్శకుడు శేఖర్ కమ్ముల మాత్రం ‘నాగ్, నువ్వు కొంచెం ఎక్కువ చేస్తున్నావ్.. నార్మల్‌గా నడవండి’ అని చెప్పేవాడు’ అని నవ్వుతూ తేలిపారు నాగార్జున. మొత్తనికి ఇలా ఇద్దరు భిన్నమైన శైలుల దర్శకులతో పని చేస్తూ, ‘కూలీ’లో గ్యాంగ్‌స్టర్ విలన్‌గా, ‘కుబేరా’లో ప్రభుత్వ అధికారి పాత్రలో నాగ్ రెండు విభిన్న పాత్రలతో అలరించనున్నారు.

Exit mobile version