Site icon NTV Telugu

నాగ్ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ షురూ!

కింగ్ నాగార్జున‌తో డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ సత్తారు హై రేంజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర ఎల్ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై నారాయ‌ణ్ దాస్ కె.నారంగ్‌, పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు, శ‌ర‌త్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోవాలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ఆగస్ట్ 4న హైదరాబాద్ లో మొదలైంది. తొలి రోజున నాగార్జునపై కొన్ని కీలక సన్నివేశాలను ప్రవీణ్ సత్తారు చిత్రీకరించారు. ఈ సందర్భంగా తీసిన ఓ వర్కింగ్ స్టిల్ ను ప్రవీణ్ సత్తారు ‘షూట్ రెజ్యూమ్స్’ అనే కాప్షన్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇది నాగార్జునకు కమ్ బ్యాక్ మూవీ కావాలని, మళ్లీ పాత నాగార్జునను తాము చూడాలనుకుంటున్నామని, కాస్తంత సమయం తీసుకుని అయినా… ఆయనకు సూపర్ డూపర్ హిట్ మూవీని ఇవ్వమంటూ ప్రవీణ్ సత్తారును నాగ్ అభిమానులు ఈ సందర్భంగా కోరుతున్నారు. నాగార్జున పుట్టినరోజు ఆగస్ట్ 29న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా టైటిల్ అనౌన్స్ మెంట్ జరిగే ఆస్కారం ఉంది. ఈ మూవీ షూటింగ్ ను ఇండియాలోని ప్ర‌ధాన న‌గ‌రాలతో పాటు విదేశాల్లో చిత్రీక‌రించేలా ప్లాన్ చేశారు. నాగార్జున ఇందులో ఔట్ అండ్ ఔట్‌ యాక్ష‌న్ ప్యాక్డ్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. గుల్ ప‌నాంగ్‌, అనైకా సురేంద్ర‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Exit mobile version