NTV Telugu Site icon

నాగ్ తో ప్రవీణ్ సత్తారు మూవీ ఆగిపోయిందా ?

Nagarjuna and Praveen Sattaru Movie called off

కింగ్ నాగార్జున ఇటీవలే ‘వైల్డ్ డాగ్’ అనే యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం కరోనా సమయంలోనూ ప్రేక్షకులను విజయవంతంగా మెప్పించింది. ప్రస్తుతం నాగ్ తర్వాత ప్రాజెక్టు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రానికి సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.

ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రం క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆగిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. సమాచారం ప్రకారం నాగార్జున స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయమని దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ని అడిగారట. అయితే ప్రవీణ్ సత్తారు అందుకు ఒప్పుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్టు గా తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాల్సి ఉంది.

ప్రవీణ్ సత్తారుతో మూవీ ఆగిపోవడంతో ప్రస్తుతం నాగార్జున ‘బంగార్రాజు’ చిత్రాన్ని రూపొందించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కరోనా తీవ్రత తగ్గాక ‘బంగార్రాజు’ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ‘బంగార్రాజు’ చిత్రాన్ని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించనున్నారు. నాగార్జున ఈ చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా స్వయంగా నిర్మించనున్నారు.