Site icon NTV Telugu

Nagachaithanya :చైతూ షాకింగ్ డెసిషన్.. ఏంటి ఇలా మారిపోయాడు?

Nag Chai

Nag Chai

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ లో పెట్టేస్తున్నాడు.. గతంలో ధూత సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా సాలిడ్ హిట్ ను సొంతం చేసుకుంది.. ఇప్పుడు అదే జోష్ లో మరో మూవీ తండేల్ సినిమాను చేస్తున్నాడు.. ఆ సినిమా భారీ ధరకు ఓటీటీ డీల్ కుదుర్చుకుంది.. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. త్వరలోనే ఆ సినిమా కూడా రెగ్యులర్ షూట్ కు రెడీ అవుతుంది..

చై మూడవసారి దర్శకుడు చందూ మొండేటితో కలిసి జాతీయవాద అంశాలతో కూడిన గ్రామీణ ప్రేమకథ తండేల్ సినిమాలో చేస్తున్నాడు.. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.. ఇక ఇప్పుడు మరో సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తుంది.. కార్తిక్ దండు దర్శకత్వం వహించగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. Svcc మరియు సుకుమార్ రైటింగ్శ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. అంజిష్ లోకానాథ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహారిస్తున్నారు.. ఈ సినిమాను త్వరలోనే పూజా కార్యక్రమాలతో సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో నాగచైతన్య ఉన్నారు..

ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గానే కాదు సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతుందని సమాచారం.. ఒకప్పుడు కేవలం ప్రేమ కథా చిత్రాలను, లేదా యాక్షన్ సినిమాలతో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చే నాగచైతన్య ఇప్పుడు కొత్త సస్పెన్స్, థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఉన్న సినిమాలానే ఎంపిక చేసుకుంటున్నాడు.. ధూత సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న చై అదే ఫార్ములానే ఫాలో అవుతున్నాడని తెలుస్తుంది.. ఇప్పుడు రాబోయే సినిమాలో ఏ కాన్సెప్ట్ తో వస్తాడో చూడాలి.. ఏది ఏమైనా నాగ చైతన్య సినిమాల స్పీడును పెంచాడు..

Exit mobile version