యంగ్ హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. నేడు సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా నుండి ఒక బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్టులో ‘పార్వతి’ అనే కీలక పాత్రలో నటిస్తున్న నభా నటేష్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నభా ఎంతో డివైన్‌గా, పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇస్మార్ట్ బ్యూటీ నభా ఈ చిత్రంతో ఒక సరికొత్త మేకోవర్‌లో తన విశ్వరూపం చూపించబోతున్నట్లు అర్థమవుతోంది.
Also Read : Lenin : సమ్మర్ బరిలో అక్కినేని హీరో.. ‘లెనిన్’ రిలీజ్ డేట్ ఫిక్స్
కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఒక మాసివ్ సినిమాటిక్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు. డివైన్ ఎలిమెంట్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ .. అద్భుతమైన విజువల్ ఫీస్ట్‌తో ఈ సినిమా ఉండబోతోంది. ఐశ్వర్య మీనన్ మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం, భారతీయ పురాణాలలోని కొన్ని రహస్యాలను నేటి కాలానికి అనుగుణంగా చూపించబోతోంది. హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్ట్స్‌ను ఉపయోగిస్తుండటంతో, బాక్సాఫీస్ వద్ద ‘నాగబంధం’ ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
