NTV Telugu Site icon

Naga Vamsi : జూన్ 10 న బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలే..

Nagavamsi

Nagavamsi

Naga Vamsi : నందమూరి నట సింహం బాలకృష్ణ గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించారు.ఈ సినిమా భారీగా కలెక్షన్స్ సాధించి బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓసినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను డైరెక్టర్ బాబీ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా “NBK 109 ” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read Also :Kalki 2898 AD : ఎలాన్ మస్క్ కు నాగ్ అశ్విన్ స్పెషల్ రిక్వెస్ట్..

ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్సె వీడియో ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది.బాలయ్య మాస్ డైలాగ్స్ తో అదరగొట్టాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ మేకర్స్ భవిస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే నిన్న విశ్వక్ సేన్ నటించిన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది .ఈ ఈవెంట్ కు బాలయ్య అతిదిగా వచ్చారు.ఆ ఈవెంట్ లో నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ జూన్ 10 న బాలయ్య బర్త్ డే సందర్భంగా NBK 109 మూవీ నుంచి మరో భారీ అప్డేట్ ఇవ్వనున్నట్లు నిర్మాత నాగ వంశీ తెలిపారు.ఈ అప్డేట్ తో బాలయ్య ఫ్యాన్స్ కు ఆరోజు పూనకాలు వచ్చేస్తాయి అని నాగ వంశీ తెలిపారు.