Site icon NTV Telugu

Naga Vamsi: హీరోగా నాగ వంశీ బామ్మర్ది.. హీరోయిన్ ఎవరంటే?

Naga Vamsi Brother In Law

Naga Vamsi Brother In Law

టాలీవుడ్ లోకి మరో హీరో ఎంట్రీ ఖరారైంది. వైరల్ ప్రొడ్యూసర్ గా మారిన నిర్మాత నాగవంశీ బావమరిది హీరోగా లాంచ్ కాబోతున్నాడు. హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మాత చిన్న బాబు అనేక సినిమాలు చేశారు. తర్వాత ఆయన సోదరుడి కుమారుడు నాగవంశీ కూడా సినీ నిర్మాతగా మారి సితార ఎంటర్ టైన్మెంట్స్ అనే బ్యానర్ మొదలు పెట్టి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆయన ఒక వైరల్ ప్రొడ్యూసర్.

Fauji: ఎలివేషన్ గా బాప్ ని దింపుతున్నారు!

ఎందుకంటే నాగ వంశీ ఒక ట్వీట్ చేసినా, ఇంటర్వ్యూ ఇచ్చినా అది వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతూ ఉంటుంది. ఇక ఆయన బామ్మర్ది హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నాగ వంశీ బామ్మర్ది రుష్యా హీరోగా మిర్నా హీరోయిన్ గా ఒక సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాను బన్నీ ముప్పానేని నిర్మిస్తున్నారు. తెలుగులో కలర్ ఫోటో, తెల్లారితే గురువారం, బెదురులంక 2012 లాంటి పలు సినిమాలను బెన్నీ ముప్పానేని నిర్మించారు.

Exit mobile version