NTV Telugu Site icon

Naga Chaitanya :ప్రభాస్ బుజ్జిని నడిపిన నాగ చైతన్య..

Naga Chaitnaya (1)

Naga Chaitnaya (1)

Naga Chaitanya : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించారు.ఈ సినిమా బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది.వైజయంతి మూవీస్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు .ఈ సినిమాలో దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.దీనితో ఇప్పటి నుంచే మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

Read Also :Varun Tej : ఫిదా కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందా..?

ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమాలోని స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జిని పరిచయం చేసారు.హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేసి ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ అయిన బుజ్జి అనే రోబోటిక్ కార్ ను ప్రేక్షకులకు మేకర్స్ పరిచయం చేసారు.ఈ ఈవెంట్ లో బుజ్జిని నడుపుతూ ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.ప్రభాస్ ఎంట్రీ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.ఈ బుజ్జికి మహానటి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది.ఇదిలా ఉంటే ప్రభాస్ బుజ్జిని తాజాగా హీరో నాగ చైతన్య నడిపారు .స్పోర్ట్స్ కార్లంటే ఎంతో ఇష్టపడే నాగచైతన్య బుజ్జిని చూసి ఆశ్చర్యపోయారు.రేసింగ్ ట్రాక్ లో ఈ సూపర్ కార్ తో దూసుకొనివెళ్లారు.దీనికి సంబంధించి వీడియోను కల్కి మేకర్స్ ట్విట్టర్ లో షేర్ చేసారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Show comments