NTV Telugu Site icon

Naga Chaitanya : కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగచైతన్య ఏమన్నారంటే..?

Konda Surekah

Konda Surekah

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుత క్యాబినెట్ మంత్రి కొండా సురేఖ నిన్న సమంత, నాగ చైతన్య విడాకులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అధికారం వుంది కదా అని అడ్డు అదుపు లేకుండా సభ్య సమాజం సిగ్గుపడేలా తమ స్వార్ధ రాజకీయాల కోసం దిగజారిపోయి మాట్లాడకూడదని పలువురు టాలీవుడు హీరోలు సదరు మంత్రిపై ఘాటుగా స్పందించారు. ఓక మహిళా అయి ఉండి సాటి మహిళ వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ చేయడం ఎంత వరకు సబబు అనేది సదురు మంత్రి గారు ఆలోచించుకోవాలి.

కాగా కొండా సురేఖ వ్యాఖ్యలపై ఘటూగా రియాక్ట్ అయ్యాడు నాగ చైతన్య. తన వ్యక్తిగత X ఖాతలో ” విడాకుల నిర్ణయం అనేది అత్యంత బాధాకరమైన మరియు దురదృష్టకరమైన జీవిత నిర్ణయాలలో ఒకటి. చాలా ఆలోచించిన తర్వాత, నేను మరియు నా మాజీ జీవిత భాగస్వామి విడిపోవాలని పరస్పర నిర్ణయం తీసుకున్నాము. ఇది మన విభిన్న జీవిత లక్ష్యాల కారణంగా మరియు ముందుకు సాగాలనే ఆసక్తితో శాంతియుతంగా తీసుకున్న నిర్ణయం.ఈ విషయంపై ఇప్పటి వరకు అనేక నిరాధారమైన మరియు పూర్తిగా హాస్యాస్పదమైన గాసిప్స్ వచ్చాయి. నా పూర్వపు జీవిత భాగస్వామితో పాటు నా కుటుంబం పట్ల ఉన్న గాఢమైన గౌరవంతో నేను ఇదంతా మౌనంగా ఉన్నాను.నేడు మంత్రి కొండా సురేఖ గారు చేస్తున్న వాదన అబద్ధం మాత్రమే కాదు, ఇది పూర్తిగా హాస్యాస్పదమైనది మరియు ఆమోదయోగ్యం.సెలబ్రిటీల వ్యక్తిగత జీవిత నిర్ణయాలను మీడియా హెడ్‌లైన్స్ కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటు. అంటూ పోస్ట్ పెట్టారు అక్కినేని నాగ చైతన్య.

Show comments